తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు.