ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్యకు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

కడప: వైయస్‌ఆర్‌ సీపీ బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య భౌతిక కాయానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోని కో–ఆపరేటీవ్‌ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య నివాసానికి చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌.. వెంకట సుబ్బయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని సీఎం వైయస్‌ జగన్‌ వారికి భరోసానిచ్చారు. 

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కడపలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. 1960లో జన్మించిన వెంకట సుబ్బయ్య ఆర్థోపెడిక్‌ సర్జన్‌గా ప్రజలకు సేవలందించారు. 2016లో బద్వేల్‌ వైయస్‌ఆర్‌ సీపీ కో–ఆర్డినేటర్‌గా పనిచేశారు. 2019లో తొలిసారిగా డాక్టర్‌ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు.
 

Back to Top