అవుకు రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేసిన సీఎం వైయస్‌ జగన్‌

నంద్యాల: అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి అవుకు రెండో టన్నెల్‌ వద్దకు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌.. ముందుగా ఫొటో గ్యాలరీని పరిశీలించారు. అనంతరం నీటిని విడుదల చేసిన రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంట డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రులు అంబటి రాంబాబు, గుమ్మ‌నూరు జ‌య‌రాం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, వైయస్‌ఆర్‌ సీపీ నేతలు ఉన్నారు. 
 
దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. తద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. అవుకు సొరంగాల పనులకు దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేయగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్‌ జోన్‌లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్‌ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్‌ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్‌లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం జ‌రిగింది. 

Back to Top