రేపు రాజ‌మండ్రిలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేపు తూర్పుగోదావ‌రి జిల్లా రాజమండ్రిలో ప‌ర్య‌టించ‌నున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ హాజరు కానున్నారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరి మధ్యాహ్నం 3:50 గంటలకు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలకు చేరుకుంటారు. రాజ‌మండ్రిలో స్థానిక నేతలతో మాట్లాడనున్నారు. అనంతరం సాయంత్రం 4.10 గంటలకు మంజీరా కన్వెన్షన్ హాల్‌కు చేరుకుంటారు. అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంత‌రం సాయంత్రం 4.25 గంటలకు తాడేపల్లికి బయల్దేరుతారు. 

Back to Top