‘రా కదలి కదలిరా’ అని పిలుపునిచ్చినా కదలిరాలేదు

చంద్రబాబు తిరువూరు సభపై దేవినేని అవినాష్ సెటైర్లు..

విజ‌య‌వాడ‌:  తెలుగు దేశం పార్టీ తిరువూరు సభ అట్టర్ ప్లాప్ అయ్యింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు దేవినేని అవినాష్ అన్నారు. తిరువూరు సభలో చంద్రబాబు ఖాళీ కుర్చీలకు కబుర్లు చెప్పాడ‌ని, ‘రా కదలి కదలిరా’ అని పిలుపునిచ్చినా టీడీపీ నాయకులు కదలలేదు.. కదలిరాలేదని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేని స్థితిలో టీడీపీ నేతలు ఉన్నారని విమ‌ర్శించారు. బీసీలు వైయ‌స్ జగన్ ప్రభుత్వంలో బ్యాక్ బోన్ క్యాస్ట్‌గా ఉన్నార‌ని, వార్డు మెంబర్, కార్పొరేటర్ స్థాయి నుంచి చైర్మన్ పదవులకు వరకు సీఎం వైయ‌స్  జగన్ ప్రభుత్వం బీసీ కులస్తులకే పట్టం కట్టిందని గుర్తు చేశారు.

Back to Top