తాడేపల్లి: రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన ప్రజాజీవితంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా చట్టసభల్లో వివిధ అంశాలపై చేసిన ప్రసంగాలతో ‘40 ఏళ్ల ప్రజాజీవితం’ పేరిట రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ఆయన కలిసి పుస్తకాన్ని అందించారు.