అనంతపురం: ‘రాబోయే రెండేళ్లు ప్రజల్లోనే ఉండి వారితో మమేకమవుతూ.. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి...అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిద్దామని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడదామని పిలుపునిచ్చారు. ఉరవకొండ దేవాంగ కల్యాణ మండపంలో నియోజకవర్గంలోని వైయస్ఆర్‌సీపీ సర్పంచులు, ఎంపీపీ, ఎంపిటిసిలు,రాష్ట్ర డైరెక్టర్లు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాలు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, అగ్రి అడ్వైజరి బోర్డు చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రమణ, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.పార్టీ బలోపేతంపై చర్చించి పలు సూచనలు చేశారు. వారికి దిశానిర్దేశం చేశారు.2019 ఎన్నికల నాటికంటే వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో మరింతగా ఆదరణ పెరిగిందని మాజీ ఎమ్మెల్యే అన్నారు. సర్పంచ్, ఎంపిటిసి, మున్సిపల్ ఇలా ‘‘ప్రతి ఎన్నికలోనూ ప్రజలు వైయస్ఆర్‌సీపీ ని గెలిపించారని పేర్కొన్నారు సీఎం వైయస్ జగన్ విధానాలతో ప్రజలలో పెరిగిన విశ్వాసమే ఇందుకు నిదర్శనం అన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని, చెప్పని వాగ్దానాలను కూడా వైయస్ జగన్ నెరవేర్చారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిని పారదర్శకంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒక్కటేనని వైయస్ జగన్ చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలని పేర్కొన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత విప్లవాత్మకమైన కార్యక్రమాలతో అభివృద్ధి పథంలో ముందుకు పోతోందని ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.నాడు చంద్రబాబు మోసం చేసినట్లు గా జగన్మోహన్ రెడ్డి మోసం చేయలేదని ఏదైతే చెప్పాడో అది తన రెండేళ్ల పాలనలో చేసి చూపించాడన్నారు.ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు 95 శాతం అమలు చేసిన ఏకైక సీఎం జగన్ ఒక్కరే నని దేశంలో ఏ పార్టీ, ఏ ముఖ్యమంత్రి ఇలా అమలు చేయలేదన్నారు.ఇవన్నీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.అంతే కాక తెలుగుదేశం కంటే దాన్ని బ్రతికించాలని చూస్తున్న ఎల్లో మీడియా పై మనం పోరాటం చేయాలని వాటి దుష్ప్రచారాన్ని ఎండగట్టాలని సూచించారు.ఈ 10 రోజుల్లో ఆయా గ్రామాల్లో బూత్ కమిటీ ల ఏర్పాటు పూర్తి చేయాలని చెప్పారు.తదుపరి గడప గడప కు వైయస్ఆర్‌సీపీ కార్యక్రమం చేపడతామన్నారు. ఈ గడప గడపలో మనం ప్రజలతో మమేకం కావాలన్నారు. అనంతరం వైయస్ఆర్‌సీపీ మహిళా ప్రజా ప్రతినిధులు ,నాయకులు తదితరులతో కలిసి వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.