బాపట్ల మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని అట‌కెక్కించారు

మాజీ డిప్యూటీ స్పీక‌ర్ కోన రఘుప‌తి

బాప‌ట్ల‌:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన బాపట్ల మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని మాజీ డిప్యూటీ స్పీకర్, బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేరకు బాపట్లలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బాప‌ట్ల‌లో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం తీసుకొచ్చిన మెటీరియల్ ను వేరే చోటకి తరలిస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ స్థానిక నాయకులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు.  తాము ఎంతో కస్టపడి బాపట్లకు మెడికల్ కాలేజీ, హాస్పిటల్ తీసుకొని వస్తే దానిని అదమరచాని  తెలిపారు. బాపట్లలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలకు ఏమాత్రం పట్టడం లేదని కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top