వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్ర‌స‌క్తే లేదు

గంప‌ర్రు ఎంపీటీసీ సభ్యురాలు కంబాల సత్యశ్రీ

ఏలూరు: మా కుటుంబానికి మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అంటే ప్రాణం..  నా భర్త చివరి వరకూ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడిచారు.. ప్రాణం ఉన్నంత వరకు నేను వైయ‌స్ జగన్‌ వెంటే ఉంటాను తప్ప పార్టీని మాత్రం వీడను.. అంటూ యలమంచిలి మండలం గుంపర్రు  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు కంబాల సత్యశ్రీ తేల్చి చెప్పారు. ఎంపీపీ ఎన్నిక కోసం శుక్రవారం ఉదయం మండల పరిషత్‌ కార్యాలయానికి వచ్చిన ఆమెను.. మీరు కనిపించడం లేదని మీ కుమార్తె ఫిర్యాదు చేశారంటూ పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ కుటుంబసభ్యుల ద్వారా తమకు అనుకూలంగా ఓటు వేయాలని కూటమి నేతలు ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు. మీరు గట్టిగా ఒత్తిడి చేస్తే ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోతానే తప్ప పార్టీని వీడనని సత్యశ్రీ తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు ఆమెను తిరిగి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద దించి వెళ్లగా జరిగిన సంఘటనను సహచర సభ్యులకు సత్యశ్రీ కన్నీటి పర్యంతమవుతూ వివరించారు.   
 

Back to Top