'పీ4-జీరో పావర్టీ' పేరుతో చంద్రబాబు తాజా పబ్లిసిటీ స్టంట్

'మార్గదర్శి' అంటేనే ఆర్థిక నేరాల రామోజీ సంస్థ గుర్తుకొస్తోంది

రాష్ట్రంలో చంద్రబాబు, పవన్‌లవే 'బంగారు కుటుంబాలు'

మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం

పేదల జీవన ప్రమాణాలను పెంచే బాధ్యత ప్రభుత్వానిది

దీని నుంచి తప్పుకున్నందుకే చంద్రబాబు పీ4 హంగామా

సంపన్నులదే ఆ బాధ్యత అంటూ కొత్త డ్రామాలు

సూపర్‌ సిక్స్‌ గురించి ప్రశ్నిస్తే... పీ4 అంటూ కొత్త పల్లవి

ప్రైవేటీకరణే అన్నింటికీ మంత్రం అంటున్న చంద్రబాబు

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం

తన అసమర్థతను నిజాయితీగా ఒప్పుకున్న పవన్ కళ్యాణ్

జీవితాంతం సీఎం చంద్రబాబు కోసం సేవ చేస్తానన్న పవన్

పప్పురాజా లోకేష్ నుంచి ప్రతినెలా ప్యాకేజీరాజా పవన్‌కు వాటాలు

గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు 

గుంటూరు: కూటమి ప్రభుత్వం నిర్వహించిన 'పీ4-జీరో పావర్టీ' కార్యక్రమం చంద్రబాబు తాజా అతిపెద్ద పబ్లిసిటీ స్టంట్‌ అని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శి-బంగారు కుటుంబంలో మార్గదర్శి అంటే రామోజీరావుకు చెందిన ఆర్థిక నేరాలతో కోర్ట్ కేసులు ఎదుర్కొంటున్న సంస్థే గుర్తుకు వస్తోందని అన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలను దోచుకుని బాగుపడుతున్న బంగారు కుటుంబాలు ఏవయ్యా అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల కుటుంబాలే జ్ఞాపకం వస్తున్నాయని ధ్వజమెత్తారు. 

అంబ‌టి రాంబాబు ఇంకా ఏమ‌న్నారంటే...

ఉగాది రోజు చాలా ఆర్భాటంగా శాసనసభ సమీపంలో పీ4-జీరో పావర్టీ, 'మార్గదర్శీ-బంగారు కుటుంబం' (P4-Zero Poverty, 'Margadarshi-Golden Family')పేరుతో సీఎం చంద్రబాబు సుదీర్ఘమైన సమావేశం నిర్వహించారు. పీ4 కాన్సెప్ట్ అద్భుతమైనదని, ఏపీలో పేదరిక నిర్మూలకు ఇది దోహదపడుతుందని, ఇది తన ఆలోచనల నుంచే పుట్టిందని చంద్రబాబు చెప్పుకున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు రోడ్లపై కొత్త టోల్‌గేట్లు పెడుతున్నారు. ప్రభుత్వ రంగంలో నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను, గ్రామీణ రహదారులను కూడా పీ4 పేరుతో ప్రైవేటీకరిస్తున్నారు. వీటి ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తామని చెబుతున్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో 58 ప్రభుత్వరంగ కార్పోరేషన్‌లను ప్రైవేటీకరించిన ఘనత చంద్రబాబుదే. మొత్తం వ్యవస్థను ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు పాలన సాగుతోంది. ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్ అన్నారు. సంపదను సృష్టించి పేదలకు పంచుతాను అన్నారు. పదినెలలు అవుతోంది, సంపద సృష్టి లేదు, ఇప్పుడు ధనవంతులను తీసుకువచ్చి, వారిని పేదలకు మీ సంపదను పంచండి అని చెబుతున్నాడు. పేదరిక నిర్మూలన చేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది. పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంత ప్రజల జీవనోపాధులను మెరుగుపరచడం, ఉచిత విద్య, వైద్యం, వారికి పని కల్పించడం. ఇటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. దీనిని గత ప్రభుత్వంలో వైయస్ జగన్  అమలు చేసి చూపించారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. ప్రభుత్వం ఎంతో బాధ్యతగా పేదలను ఆర్థిక స్వావలంభన దిశగా నడిపించే కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారే తప్ప చంద్రబాబులా ఆ బాధ్యత నుంచి పారిపోయే కార్యక్రమం చేయలేదు. 

ప్రతిసారీ ప్రచార స్టంట్‌లతో చంద్రబాబు డ్రామాలు

చంద్రబాబు తాజా కాన్సెప్ట్ ప్రకారం పేదలను ఆదుకోవడం ప్రైవేటు వ్యక్తుల బాధ్యత. దీనికోసమే మెగా కృష్ణారెడ్డి, గ్రీన్‌కో వంటి సంస్థలను నిర్వహిస్తున్న చలమలశెట్టి సునీల్, సజ్జన్ గోయంకా వంటి పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్‌లను తీసుకువచ్చి వేదికపైన కూర్చోబెట్టారు. వీరిద్వారా రాష్ట్రంలోని ప్రజలను బంగారు కుటుంబాలుగా తయారు చేస్తానంటూ ప్రకటించారు. పేదలకు ప్రభుత్వం సంక్షేమాన్ని అందిస్తుందని ఆశించి కూటమి పార్టీలకు ఓట్లు వేస్తే, వారిని నట్టేట ముంచుతున్నారు. 
చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు పబ్లిసిటీ స్టంట్‌ను ప్రకటించడం, దానిని పెద్ద ఎత్తున ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయడం చేశారు. ఆయన తొలిసారి సీఎం అయిన తరువాత ఆకస్మిక తనిఖీలంటూ హంగామా చేశారు. దానివల్ల ఏదైనా ఆయన పాలనలో సాధించారా అనిచూస్తే శూన్యం. తరువాత ప్రజల వద్దకు పాలన అంటూ మరో కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చారు. ఆ తరువాత శ్రమదానం అంటూ హటావుడి చేశారు. ఆ తరువాత జన్మభూమి అంటూ మరో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకువచ్చారు. మళ్ళీ దత్తత గ్రామాలు అంటూ అందరినీ ప్రోత్సహించారు. ఎన్ని దత్తత గ్రామాల్లో నిజమైన అభివృద్ధి జరిగిందో చూపించాలి. 

లోకేష్‌(Lokesh)ను సీఎం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం

తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ నీతీనిజాయితీలతో పనిచేయాలని, తాను ఎన్టీ రామారావు వద్ద క్రమశిక్షణతో పనిచేశానని చెప్పుకున్నారు. చంద్రబాబు ఇందిరాగాంధీ వద్ద ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు.  ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని దక్కించుకున్నాడే తప్ప ఆయన ఎన్టీఆర్‌ వద్ద ఎప్పుడు పనిచేశాడు? ఎక్కడ క్రమశిక్షణను నేర్చుకున్నారు? ఏదో ఒక విధంగా తన కుమారుడిని రాజకీయాల్లో ల్యాండ్ చేసి, సీఎంను చేయాలన్నదే ఆయన లక్ష్యం. రాత్రి నిద్రపోయే సమయంలో ఈ రోజు ప్రజలకు ఏం మంచి చేశానా అని ఆలోచిస్తాను అని చంద్రబాబు చెప్పుకున్నారు. కానీ వాస్తవం ఏమిటీ అంటే నిత్యం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టాలి, ఏ విధంగా సొమ్ము వెనుకేసుకోవాలన్నదే చంద్రబాబు ఆలోచన. ఏ విధంగా అసమర్థుడు, అజ్ఞాని అయిన కుమారుడిని రాష్ట్రంపై ఎలా రూద్దాలనేదే ఆయన ఆలోచన. తాజాగా రూ.26వేల కోట్లు రుణంగా అమరావతి కోసం తీసుకువస్తున్నారు. ఈ సొమ్మును ఆయనకు చెందిన బంగారు కుటుంబాలకు పరుస్తారు. వారి నుంచి కమీషన్లు దండుకుంటారు. 

ప్యాకేజీ రాజా పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాట్లాడుతూ 'మా దగ్గర సత్తా లేనప్పుడు... ప్రజలకు ఉపయోగపడే సత్తా, బలం, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఉన్నవారికి పడే ఓట్లు చీలకుండా వారికి మద్దతు ఇస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే 2014 నుంచి చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నట్లు' ప్రకటించారు. తనకు సత్తా లేదని, చంద్రబాబుకు మాత్రమే సత్తా, పాలనా సామర్థ్యం ఉందని, ఆయన జీవితాంతం సీఎంగా ఉండాలని, తాను కింద ఉండి సేవ చేస్తానని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్నారు. మరోవైపు పవన్ అభిమానాలు తమ నాయకుడు సీఎం కావాలని అరుస్తుంటారు. ఇది పవన్ కళ్యాణ్ వింటే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ స్వయంగా తనకు సామర్థ్యం లేదు, చంద్రబాబు (Chandrababu)  మాత్రమే సమర్థుడు అని చాటారు. అలాంటప్పుడు సీఎం కావాలని పవన్ అభిమానులు ఎలా అనుకుంటారు? ఈ సందర్బంగా సీ.నారాయణరెడ్డి రాసిన ఒక గేయం ఈ సందర్భంగా గుర్తుకు వస్తోంది. 'కరగనిదే కొవ్వోత్తి కాంతిని ఎలా ఇస్తుంది... మరగనిదే నీరు ఎలా మబ్బురూపు దాలుస్తుంది... 
నలగనిదే అడుగులు ఎలా నర్తించబడతాయి... మలచనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది...?' సామర్థ్యం పెంచుకునే ప్రయత్నం చేసే ఆలోచనే పవన్ కళ్యాణ్‌కు లేదు. జనసేన సైనికులు, కాపు సోదరులు దీనిని అర్ధం చేసుకోవాలి. ఎక్కడా పవన్ కళ్యాణ్ అసమర్ధుడు అని మేం అనడం లేదు. ఆయనే తనకు పాలించే సత్తా లేదని, సీఎంగా చంద్రబాబు మాత్రమే సమర్ధుడు అని చాటుతున్నాడు. పవన్ కు ప్రతినెలా ప్యాకేజీ బ్రహ్మాండంగా అందుతోంది. అందువల్ల ఆయన తనకు సత్తా లేదు, ప్యాకేజీ తీసుకోవడం, చంద్రబాబుకు సేవచేయడం చాలు అని అనుకుంటున్నారు. ప్రభుత్వంలో వసూళ్ళు, బదిలీలు, కమీషన్లు అన్నీ పప్పురాజా నారా లోకేష్ చేస్తున్నారు. దీనిలోంచి ప్యాకేజీ రాజా పవన్ కళ్యాణ్‌కు వాటా పంపుతున్నారు. 

పీ4 జరుగుతుంటే పప్పురాజా ఎక్కడా?

ఉగాది సందర్భంగా పీ4 కార్యక్రమం జరుగుతూ ఉంటే పప్పురాజా నారా లోకేష్ కనిపించలేదు. మన చిట్టిరాజా క్రికెట్ మ్యాచ్ చూయడానికి వెళ్ళాడు. ప్రతి వారంలో రెండు రోజులు శని, ఆదివారాలు చిట్టిరాజాకు విరామం. రెండు వారాలకు ఒక సారి చంద్రబాబుకు విరామం. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు పనిలో ఉంటారో, ఎప్పుడు విరామంలో ఉంటారో తెలియదు. మొన్న నడుంనొప్పి అన్నారు. రెండు రోజులు కలెక్టర్ల మీటింగ్‌కు రాలేదు. మళ్ళీ నిన్న కనిపించారు. 

మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ...

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు తెలివితక్కువ, దురాశ వల్ల ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం. దీనిపై ఎటువంటి చర్చకు అయినా సిద్దం. పోలవరంను పూర్తి చేయాడానికి వైయస్ఆర్, వైయస్ జగన్ చిత్తశుద్దితో పనిచేశారు. చంద్రబాబు పోలవరంను ఏటీఎంలా వాడుకున్నారని స్వయంగా భారత ప్రధాని నరేంద్రమోదీనే ప్రకటించారు. కరోనా సమయంలో కూడా పోలవరం నిర్మాణం నిలిచిపోకుండా ముందుకు తీసుకువెళ్ళిన ఘనత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వానిదే. చంద్రబాబు అబద్దాలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. డయాఫ్రంవాల్ తమ హయాంలో నిర్మాణం చేశాం, వైయస్ జగన్ గారు కాఫర్ డ్యాంలను పూర్తి చేయకపోవడం వల్లే నష్టం జరిగిందని చెబుతున్నారు. సాగునీటి రంగంలో ఏ మాత్రం అనుభవం ఉన్నవారైనా సరే ముందుగా కాఫర్ డ్యాంలను నిర్మించిన తరువాతే డయాఫ్రంవాల్ నిర్మాణం చేయాలని చెబుతారు. కానీ చంద్రబాబు చేసిన తెలివితక్కువ పనివల్లే పోలవరంకు నష్టం జరిగింది. నది ప్రవహిస్తుండగానే వేసవిలో డయాఫ్రంవాల్ నిర్మించి, కాఫర్ డ్యాంలు సగం వేసి వదిలేశారు. చంద్రబాబు చెబుతున్న లెక్కల ప్రకారం 90 శాతం పనులు పూర్తయితే ఎందుకు ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం లేదు. 2027 వరకు సమయం కావాలని ఎలా అడుగుతున్నారు? పోలవరంను సర్వనాశనం చేసింది చంద్రబాబు. కేంద్రం చేయాల్సిన ప్రాజెక్ట్ ను రాష్ట్రం ఎందుకు తీసుకుంది? ఎన్నిసార్లు దీనిపై ప్రశ్నించినా సమాధానం లేదు.

Back to Top