వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన చిత్తూరు ఐదో డివిజన్ ఇంఛార్జ్‌ మురళీ 

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని చిత్తూరు ఐదో డివిజన్ ఇంఛార్జ్‌ మురళీధర్‌ రెడ్డి క‌లిశారు. చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లిలో తనపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుల సీసీ కెమెరా విజువల్స్ మురళీధర్ వైయస్‌ జగన్‌కు చూపించారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టినందుకు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్‌ అనుచరులు త‌న‌పై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని, ఎమ్మెల్యే అరాచకాలను వైయస్‌ జగన్‌కు వివరించారు. మురళీ కుటుంబానికి న్యాయం జరిగేవరకూ పూర్తి  అండగా ఉంటామని ఈ సంద‌ర్భంగా వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందించనున్నట్లు వారికి భరోసా క‌ల్పించారు. చిత్తూరు వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ‌ ఇంఛార్జ్‌ విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో మురళీధర్‌ రెడ్డి వైయస్‌ జగన్‌ ను కలిశారు.

Back to Top