ప్రేమోన్మాది ఘాతుకంపై  వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

తాడేప‌ల్లి: విశాఖపట్నంలో ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరోకరు ప్రాణాపాయ స్ధితిలో ఉండడంపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ సీఎం వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజమహేంద్రవరంలో వేధింపులు తాళలేక ఫార్మసీ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మరువకముందే విశాఖలో ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం, యువతి దీపిక ప్రాణాపాయ స్ధితిలో ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమోన్మాది నవీన్‌ను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లక్ష్మి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు.

Back to Top