వైయ‌స్‌ జగన్ తోనే ఉంటా. ..కేసులకు భయపడను

మైనింగ్ కేసుపై స్పందించిన పెర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి 

నెల్లూరు జిల్లా:  కూట‌మి ప్ర‌భుత్వం పెట్టే అక్ర‌మ కేసుల‌కు భ‌య‌ప‌డేది లేదని, వైయ‌స్ జ‌గ‌న్ వెంటే ఉంటాన‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి పెర్నాటి శ్యామ్‌ప్ర‌సాద్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. మాజీ మంత్రి కాకాణిపై నమోదైన మైనింగ్ కేసులో ఏ1గా ఉన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్పందించారు.  తాను అప్రూవర్ గా మారినట్టు చేస్తున్న‌ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. రుస్తుం మైన్స్ పై అధికారులకే క్లారిటీ లేద‌ని,  ఓనర్ కూడా లేని మైన్స్ లో అక్రమాలు  జరిగాయని మాపై కేసు పెట్టడం దారుణమ‌న్నారు.  కేసులు పెడితే భయపడి వెనక్కి తగ్గే రకం కాద‌ని,  ఎప్పటికీ అధినేత వైయ‌స్ జగన్ తోనే ఉంటాన‌ని ఉద్ఘాటించారు.  మాజీ మంత్రి కాకాని మీద నమోదైన అక్రమ కేసులో త‌న‌ను ఏ1గా చేర్చారని తెలిపారు.  ఫిబ్రవరి 16న త‌న‌ను నిందితుడిగా చేర్చితే 24వ తేదీ ఈ కేసులో బెయిల్ వచ్చింద‌న్నారు.  ఈ కేసులో ఉన్న వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులకి మైనింగ్ డీడీ షోకాజ్ నోటీసులు ఇచ్చార‌ని, రూ.7కోట్ల 56 లక్షల పెనాల్టీ వేశార‌ని తెలిపారు. ప్రస్తుత మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ త‌న పేరు కూడా చేర్చి..  పోలీసులకు ఫిర్యాదు చేశార‌ని,  ఓనర్ కూడా లేని మైన్స్ లో అక్రమాలు జరిగాయని మాపై కేసు పెట్టడం దారుణమ‌నిశ్యామ్ ప్ర‌సాద్‌రెడ్డి ఫైర్ అయ్యారు. 
 

Back to Top