10 నెల‌ల్లో ప్ర‌కాశం జిల్లాకు ఏం చేశారో చెప్పండి

నారా లోకేష్ వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ ధ్వ‌జం

హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే తాటిప‌ర్తి

వెలిగొండ ప్రాజెక్టులో మీరు త‌ట్ట మ‌ట్టినైనా తీశారా?

ఇద్ద‌రు మంత్రులుండీ మీరు జిల్లాకు చేసింది శూన్యం 

జిల్లాపై మంత్రి లోకేష్‌కి క‌నీస అవ‌గాహ‌న లేదు

ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ ఆక్షేప‌ణ‌

వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో ప్ర‌కాశం జిల్లాలో గ‌ణ‌నీయ‌మైన అభివృద్ధి

మార్కాపురంలో మెడిక‌ల్ కాలేజీ, రామాయ‌ప‌ట్నం పోర్టు నిర్మించాం

స‌చివాల‌యాలు, ఆర్బీకే కేంద్రాలు, మిల్క్ చిల్లింగ్ సెంట‌ర్లు, హెల్త్ సెంట‌ర్లు, డిజిట‌ల్ లైబ్ర‌రీల కోసం రూ. 2 వేల కోట్ల‌కుపైగా కేటాయించాం.

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 10 వేల కోట్లు కేటాయించింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం

వివ‌రాలు వెల్ల‌డించిన య‌ర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్‌

హైద‌రాబాద్‌:  టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన‌ 10 నెల‌ల్లో ప్ర‌కాశం జిల్లాకు ఏం చేశారో చెప్పాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌శ్నించారు. ఏం చేశారో చెప్పుకోలేక‌నే రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. బుధ‌వారం ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ మీడియాతో మాట్లాడారు.

ఎన్నిక‌ల హామీలు నెర‌వేర్చారా?

- ప్ర‌కాశం జిల్లా కనిగిరిలో సీబీబీ ప్లాంట్ శంకుస్థాప‌న స‌భ‌కు హాజ‌రైన మంత్రి లోకేష్, ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌లు హాస్యాస్ప‌దంగా ఉన్నాయి. గ‌డిచిన 10 నెల‌లుగా ప్ర‌కాశం జిల్లాకి ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న ప్ర‌భుత్వం, ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా ప్ర‌శ్నించిన వారిపై రెడ్ బుక్ పేరుతో బెదిరింపుల‌కు దిగుతోందని చెప్ప‌డానికి ఆయ‌న వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నం.  

- మార్కాపురంని జిల్లాగా ప్ర‌క‌టించిన త‌ర్వాతే జిల్లాలో అడుగుపెడ‌తామ‌న్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరును ప్ర‌కాశం జిల్లాలో క‌లుపుతామ‌న్నారు. దాన్ని ఇంత‌వ‌ర‌కు ప‌ట్టించుకోలేదు. 

వెలిగొండ‌ను గాలికొదిలేశారు

- వెలిగొండ ప్రాజెక్టును రెండేళ్ల‌లో పూర్తి చేస్తామ‌న్నారు. అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌వుతున్నా ప్రాజెక్టు కోసం త‌ట్టెడు మ‌ట్టి ఎత్తలేదు. ప్రాజెక్టు పూర్తి చేయ‌డానికి అవ‌ర‌స‌ర‌మైన నిధులు కూడా కేటాయించలేదు. ఇటీవలే జిల్లాకు వ‌చ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్రాజెక్టును కూడా సంద‌ర్శించ‌డానికి ధైర్యం చేయ‌లేక వెళ్లిపోయారు. ఇద్ద‌రు మంత్రులుండీ వెలిగొండ ప్రాజెక్టు లైనింగ్ ప‌నులు చేప‌ట్ట‌లేదు. ప్ర‌కాశం జిల్లాకు ఏమీ చేయ‌లేక‌పోయారు. లోకేష్ మాట‌లు వింటుంటే ఆయ‌న‌కు ప్ర‌కాశం జిల్లాపై క‌నీస అవ‌గాహ‌న లేద‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. 

- జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్ప‌పుడు మంచి చేస్తామ‌ని  చెప్పేమంత్రుల‌ను చూశాం కానీ, మాట్లాడితే కేసులు పెడ‌తామ‌ని హెచ్చ‌రించే మంత్రిని లోకేష్‌నే చూస్తున్నాం. లోకేష్ రెడ్ బుక్ కి ఎవ‌రూ భ‌య‌ప‌డేది లేదు. ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల‌కు నిర్వ‌హించిన ఉప ఎన్నిక‌లతో ఆ విష‌యం లోకేష్‌కి అర్థ‌మ‌య్యే ఉంటుంది. 

వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో ప్ర‌కాశం జిల్లా అభివృద్ధి ప‌రుగులు

- ప్ర‌కాశం జిల్లాకు వైయ‌స్ఆర్‌సీపీ ఏం చేసింద‌ని ప్ర‌శ్నించే లోకేష్‌, మార్కాపురం మెడిక‌ల్ కాలేజీ నిర్మాణానికి రూ. 475 కోట్లు కేటాయించింది. పాల శీత‌లీక‌ర‌ణ కోసం 161 సెంట‌ర్లు ఏర్పాటు చేశాం. 591 సచివాల‌యాలు, 593 ఆర్బీకే సెంట‌ర్లు, దాదాపు 1992 బ‌డుల‌ను నాడు-నేడు కింద ఆధునీక‌రించాం. 228 డిజిట‌ల్ లైబ్ర‌రీలు, 492 హెల్త్ సెంట‌ర్లు, రెండు అగ్రి ల్యాబ్‌లు వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలోనే ఏర్పాటు చేశాం. వీటన్నింటికీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏకంగా రూ. 2 వేల కోట్ల‌కుపైచిలుకు కేటాయించగా, ఒక్క వెలిగొండ ప్రాజెక్టు కోస‌మే ఏకంగా రూ. 10 వేల కోట్లు కేటాయించ‌డం జ‌రిగింది. 

- రామాయ‌ప‌ట్నం పోర్టును వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలోనే మొద‌లుపెట్టి దాదాపు 50 శాతం ప‌నులు పూర్తి చేయ‌డం జ‌రిగింది. జిల్లాకు మెడిక‌ల్ కాలేజీ వ‌చ్చిందంటే అదీ వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలోనే. 

- మ‌ర్డ‌ర్లు, మాన‌భంగాలు చేసిన వారంతా తెలుగుదేశం పార్టీలో ఉంచుకుని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ వైయ‌స్ఆర్‌సీపీ గురించి మాట్లాడ‌టం హాస్యాస్ప‌దంగా ఉంది. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. రోజుకు 70 మంది మ‌హిళ‌ల మీద అఘాయిత్యాలు జ‌రుగుతున్నాయ‌ని వారే ఒప్పుకున్నారు. 
ఆధారాలు లేకుండా అవాకులు చ‌వాక‌లు పేలడం మానుకోవాలి. 

- వెనుక‌బ‌డిన ప్ర‌కాశం జిల్లా మీద ప్ర‌భుత్వం క‌రుణ చూపించాలి. ప్ర‌జాప్ర‌తినిధులుగా బాధ్య‌తగా మెల‌గాలి. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల విష‌యంలో చిత్త‌శుద్ధితో ప‌నిచేయాలి. 

- కేవ‌లం ప‌ది నెల‌ల పాల‌న‌తోనే కూట‌మి ప్ర‌భుత్వం దారుణ‌మైన ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంది. వ్య‌వ‌సాయం భార‌మైంది. గ్రామాల్లో రైతుల ప‌రిస్థితి దారుణంగా ఉంది. తెలుగుదేశం నాయ‌కుల‌ను తొంద‌ర్లోనే వెంట‌బ‌డి త‌రిమి కొట్టే రోజులు రాబోతున్నాయి. 

- గ‌తంలో 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన చంద్ర‌బాబు జిల్లాకు ఏం చేశాడో చ‌ర్చ‌కు సిద్ధ‌మా?
 

Back to Top