కర్నూలు: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కర్నూలు నగరంలో పర్యటించారు. వైయస్ఆర్‌సీపీ కోడుమూరు నియోజకవర్గ నాయకుడు, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు వైయస్ జగన్ హాజరయ్యారు. నగరంలోని జీఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన వేడుకల్లో నూతన వధువరులు శ్రేయ, వివేకానందలను వైయస్ జగన్ ఆశీర్వదించారు. కాగా, కర్నూలు నగరానికి వచ్చిన మాజీ సీఎం వైయస్ జగన్‌కు వైయస్ఆర్‌సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అభిమాన నేతను చూసేందుకు, కరచాలనం చేసేందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.