ఎన్టీఆర్‌ మరణంతోనే నిజమైన టీడీపీ చనిపోయింది

చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ వెన్నుపోటు నుంచి పుట్టింది 

ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించినప్పుడు చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నారు?

అవకాశవాద రాజకీయాలతో బతుకుతున్న పార్టీ తెలుగుదేశం

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్

వాపును చూసి బలుపని విర్రవీగుతున్నవా లోకేష్ రాజా

రెడ్‌బుక్ చూసి అందరూ వణికిపోతున్నారంటూ తప్పుడు కూతలు

చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు బేలగా మాట్లాడింది మరిచావా లోకేష్ రాజా

లోకేష్‌ రాజాకు ముందుంది ముసళ్ళ పండుగ

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం

ఎన్నికలకు సూపర్‌సిక్స్ అమలు చేయాలని అనుకున్నారు

అధికారంలోకి వచ్చిన తరువాతే అమలు చేయలేనమి తెలిసిందంటా

ఇదీ చంద్రబాబు మోసపూరిత నైజం

గుంటూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు

గుంటూరు: నందమూరి తారక రామారావు మరణంతోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని, ప్రస్తుతం నారా చంద్రబాబు నేతృత్వంలోనిది వెన్నుపోటు నుంచి పుట్టిన పార్టీయేనని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ .. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ నుంచి పార్టీని లాక్కుని, అవకాశవాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. 

ఇంకా ఆయన ఏమన్నారంటే...

తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినం సందర్భంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు. టీడీపీ అధికారం కోసం పుట్టినది కాదని, ఆవేశంలో పుట్టినదని, ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో పుట్టిన పార్టీ అని చెప్పారు. ఆనాడు ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు? కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభిస్తే, ఆదే కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్‌పైనే పోటీ చేస్తానంటూ ఆనాడు చంద్రబాబు బీరాలు పలికిన విషయం మరిచిపోయారా? ఈ రోజు టీడీపీని చంద్రబాబే స్థాపించినట్లుగా మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. 

ఏనాడైన తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా?

తమది పేదల కోసం ఎగిరేజెండా అని చంద్రబాబు చాటుకుంటున్నారు. ఏనాడైనా తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా? ఎర్రజెండాలు, బీజేపీ, బీఎస్పీ ఆఖరికి కాంగ్రెస్, జనసేన జెండాలను కూడా తమ పక్కన పెడితే కానీ ఆయన జెండా ఎగరలేదు. ఎన్నికలకు ఒంటరిగా వెళ్ళే ధైర్యంలేని పార్టీ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీది. దాని గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్ చేయాలని అనుకున్నాం, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత చూస్తే చేయలేకపోతున్నామని అంటున్నారు. దీనినే రేవుదాటిన తరువాత తెప్ప తగలేయడం అనేది. చంద్రబాబు చరిత్ర అంతా కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేయడమే. చంద్రబాబుకు ఊసరవెల్లి ఆదర్శం. సిద్దాంతాలతో పనిలేకుండా అధికారమే పరమావధిగా ఎవరితోనైనా జత కడతారు. ఇది కార్యకర్తల పార్టీ, శాశ్వతంగా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇదే పార్టీలోని కార్యకర్తలను ఆయన ఈసడించుకుంటున్నారు. తన కుమారుడి పదవి కోసం ఈ పార్టీ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారు. అధికారం కోసం బీజేపీతో, తరువాత కమ్యూనిస్ట్ లతో, మళ్ళీ బీజేపీతో, ఇప్పుడు జనసేనతో జత కట్టారు. అవసరం తీరిన తరువాత ఆ పార్టీలను పక్కకుతోసేయడంలో చంద్రబాబు దిట్ట. 

రెడ్‌బుక్ అంటూ విర్రవీగుతున్న లోకేష్ రాజా

చంద్రబాబు వారసత్వంను లోకేష్ రాజా పుణికిపుచ్చుకున్నారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా సంపాధించారు. ఇప్పుడు మళ్ళీ మంత్రి అయిన తరువాత అధికార మదంతో మాట్లాడుతున్నారు. తన రెడ్‌బుక్ చూసి రాష్ట్రంలో అందరూ వణికిపోతున్నారని విర్రవీగుతున్నాడు లోకేష్ రాజా. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలు వెళ్ళకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్ళినప్పుడు వణికిపోతూ మాట్లాడిన మాటలు మరిచిపోయావా లోకేష్ రాజా. జైలులో చంద్రబాబుకు వెన్నుపూస కింద వరకు దద్దుర్లు వచ్చాయని, రాత్రిపూట దోమలు కుడుతున్నాయని, శరీరంపై పొక్కులు మొలుస్తున్నాయని వాపోయారు. 750 మంది డ్రగ్స్ తీసుకునే నేరచరిత్ర ఉన్న ఖైదీలున్న జైలులో మా నాన్నను వేశారంటూ లోకేష్‌ వణికిపోతూ మాట్లాడిన మాటలు మరిచిపోయారా? ఈ రోజు అధికారం ఉందని తన రెడ్‌బుక్ చూసి గుండెపోటు, బాత్రూమ్‌లో జారి పడిపోతున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్న లోకేష్‌ రాజాకు ముందుంది ముసళ్ళ పండుగ. ఈ రోజు నీవల్ల వేధింపులకు గురవుతున్న ప్రతి ఒక్కరూ తమ బుక్కుల్లో లోకేష్ పేరు రాసుకుంటున్నారు రాజా. 
పార్టీ ఆవిర్భావ దినోత్సవంను ఎగతాళి దినోత్సవంగా మారుస్తూ మాట్లాడుతున్న దానికి ఏదో ఒకరోజు జవాబు దొరుకుతుంది రాజా. హామీలు అమలు చేయని మీ అసమర్థతపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై మీరు పెడుతున్న కేసులపై న్యాయస్థానాల స్పందన చూసిన తరువాత అయినా సిగ్గు తెచ్చుకోవాలి. రెడ్‌బుక్ రాజ్యాంగం, వాగ్దానాల అమలు చేయకుండా పారిపోయే మోసగాళ్ళు మీరు. పార్టీ ఆవిర్భావం మీది కాదు, నందమూరి తారక రామారావుది. ఆయన పార్టీని మీరు మోసపూరితంగా వెన్నుపోటు పొడిచి లాక్కున్నారు. అవకాశవాద రాజకీయాలతో బతుకుతున్న పార్టీ. వాపుచూసి బలం అనుకుంటోంది, శక్తిలేని పార్టీ. తెలుగుదేశం ఒక పేకమేడ లాంటివి. వారినీ వీరిని అడ్డంపెట్టుకుని బతుకుతున్న రాజకీయ జీవితాలు. 

దోపిడీనే చంద్రబాబు నైజం

తాజాగా విజయం సాధించగానే సంపద సృష్టించి ప్రజలకు పంచుతాను అన్నారు. సూపర్ సిక్స్ ను అమలు చేస్తానని అన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా అమరావతి నిర్మాణానికి హుండీలు పెట్టారు, చందాలు ఇవ్వమని అడిగారు, ఇటుకలు అమ్ముకున్నారు. అమరావతికి రెండు గాజులు ఇచ్చి అమరావతిని దోచుకున్నారు. ఇప్పుడు 26వేల కోట్లు అమరావతి అంటున్నారు. దీనిలోనూ దోపిడీ. కాంట్రాక్టర్‌ల కోసం పోలవరంను తాకట్టుపెట్టారు. డయాఫ్రం వాల్ వేసేసిన తరువాత జగన్ గారు కాఫర్‌ డ్యాంలను క్లోజ్ చేయలేదంటూ అర్థంలేని మాటలు మాట్లాడారు. సింపుల్ గా ఇన్వెస్ట్ చేయడం... భారీగా బాగుపడటం చంద్రబాబు నైజం. రెండెకరాల నుంచి ప్రారంభించారు, నేడు వేల కోట్లు సంపాధించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి చంద్రబాబు. అధికారంను అడ్డం పెట్టుకుని దోచుకోవడం, జనానికి పంచడం, ఓట్లు కొనుగోలు చేయడం చంద్రబాబుకు అలవాటు.

Back to Top