నెల్లూరు జిల్లా: ఉడత బెదిరింపులకు భయపడనని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కాకాణి లక్ష్యంగా కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అక్రమ కేసులపై కాకాణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక కేసు పెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచే నా గళం విప్పుతున్నా. కేసులకు భయపడే ప్రసక్తే లేదు’’ అంటూ ఆయన తేల్చి చెప్పారు. హామీలు అమలు చేయాలని కోరితే కేసు పెట్టారు. క్వార్జ్‌కి సంబంధించి మరో కేసు పెట్టారు. ఏదో ఒక విధంగా నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నేనేమి తప్పు చేయలేదు’’ అని కాకాణి పేర్కొన్నారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాను. సిట్, విజిలెన్స్ విచారణలకు భయపడను. ఈ కేసుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. కొన్ని కేసుల్లో క్వాష్ పిటిషన్ వేశాను. ఈ కేసు మీద కూడా వేస్తాను’’ అని కాకాణి తెలిపారు.