టార్గెట్ వైయ‌స్ఆర్‌సీపీ ఆఫీస్‌.. 

అధికారుల ఆడియో లీక్‌
 

భీమవరం: ఏపీలో కూటమి ప్రభుత్వం కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ ఆఫీసులను టార్గెట్‌ చేసి కూల్చివేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్‌ రెడీ చేసింది. కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ పోలీసుల పహారాలో కూల్చివేతలను ప్రారంభించింది. 
ఇందులో భాగంగానే భీమవరంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆఫీసు కూల్చివేత ప్రయత్నానికి సంబంధించిన ఇద్దరు అధికారులు మాట్లాడుకున్న ఆడియో తాజాగా బయటకు వచ్చింది. ఈ ఆడియోలో వైయ‌స్ఆర్‌సీపీ ఆఫీసులను కూల్చివేయడానికి ముందు తేదీతో నోటీసులు ఇవ్వాలని సైట్‌ అధికారి మాట్లాడటం స్పష్టంగా ఉంది. దీంతో, ప్లాన్‌ ప్రకారమే ఆఫీసుల కూల్చివేతలు జరుగుతున్నాయిని బట్టబయలైంది. ఇలాగే అన్ని జిల్లాలోని ఆఫీసులకు ప్లాన్‌ రెడీ చేసినట్టు తెలుస్తోంది.

ఈ వీడియోలో పంచాయతీ సెక్రటరీ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో తాను సేఫ్‌ జోన్‌లో ఉండేందుకు సైట్‌ ఇంజనీర్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో ఆఫీసు కూల్చివేత నోటీసుకు సంబంధించి ముందు తేదీతో నోటీసులు ఇవ్వాలని ఇద్దరూ మాట్లాడుకున్నారు. ముందుగానే చెప్పినట్టు మాట రూపంలో కాకుండా నోటీసు రూపంలో ఇస్తానని మాట్లాడుకోవడం గమనార్హం. మున్సిపల్‌ అధికారులు నోటీసులు అంటించమన్నారు కాబట్టి ఇలా మీతో మాట్లాడాల్సి వచ్చిందని అనుకున్నారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.ఇలాంటి కుట్ర‌లు ఇంకా ఎన్ని చేస్తారోన‌ని నేటిజ‌న్లు అధికార పార్టీ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
 

 

Back to Top