బీసీలకు రాజకీయ రాత రాసిన నాయకుడు వైయస్‌ జగన్‌

56 కార్పొరేషన్లతో బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేశారు

కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం

విజయవాడ: బలహీనవర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బంగారు బాటలు వేశారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. బీసీల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణస్వీకారోత్సవం చూస్తే సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అన్నట్లుగా ఉందన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న బీసీ సంక్రాంతి సభకు మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొని మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి.. కేబినెట్‌లో కూడా బీసీలకు అధికప్రాధాన్యత కల్పించారన్నారు. ఆనాడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి బడుగు, బలహీనవర్గాల కోసం ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలను తీసుకువచ్చారననారు. ఈరోజు సీఎం వైయస్‌ జగన్‌.. బలహీనవర్గాలకు 2 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించారన్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలకు సీఎం వైయస్‌ జగన్‌ రాజకీయ రాత రాశారన్నారు. 
 

Back to Top