వ‌ర‌ద‌లు, భారీ వ‌ర్షాల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తక్షణమే స్పందించారు

ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి   
 

నెల్లూరు: ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారు తక్షణమే స్పందించడంతో భారీ వర్షాలు, వరద పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయ‌ని ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి తెలిపారు. వ‌ర‌ద‌లు, భారీ వ‌ర్షాల కార‌ణంగా న‌ష్ట‌పోయిన  పేద కుటుంబాల‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అండ‌గా నిలిచారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు గ్రామంలో విఘ్నేశ్వర పురం, శ్రామిక నగర్, లింగంపల్లి తోపులో ఎమ్మెల్యే పర్యటించి, ప్రజలతో మమేక‌మ‌య్యారు. శ్రామిక నగర్ యస్.టి.కాలనీ లో యానాదుల కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. లింగంపల్లి తోపులో కూలిపనులకు వెళ్లలేని పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారు తక్షణమే స్పందించడంతో భారీ వర్షాలు, వరద పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయ‌ని ఎమ్మెల్యే తెలిపారు. వైయ‌స్ జ‌గ‌న్ గారు ఏరియల్ సర్వే నిర్వహించి, అన్ని ప్రాంతాలను పరిశీలించి, అధికారులతో సమీక్షించి, సత్వర చర్యలు చేపట్టవలసిందిగా ఆదేశించారు. చంద్రబాబు నాయుడు భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న కుటుంబాలకు మనోధైర్యం కల్పించడం పోయి, ప్రభుత్వంపై విమర్శలు చేసే రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడ‌ని మండిప‌డ్డారు.  చంద్రబాబు నాయుడు రాజకీయ, వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప, మరేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు.  తెలుగుదేశం హయాంలో ప్రతిపక్ష శాసనసభ్యునిగా వర్షాలు, వరదల సమయంలో ప్రజల దగ్గరకు వెళ్ళాలంటే భయపడే వాళ్ళం. సర్వేపల్లి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు, సైడు డ్రైన్లు నిర్మించడంతో పాటు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో ధైర్యంగా ప్రజల దగ్గరకు వెళ్లగలుగుతున్నామ‌ని చెప్పారు .  ప్రజలలో తిరుగుతుంటే వాళ్ళు చూపే ఆదరణ, అభిమానం అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంద‌న్నారు. 

Back to Top