వైయ‌స్ జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు

మాజీ మంత్రి పేర్ని నాని 

రెండు పేపర్లు, పది టీవీ ఛానళ్లతో నిత్యం వైయ‌స్‌ జగన్‌పై విషం చిమ్ముతున్నారు

రూ.4.50ల చొప్పున చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే తప్పు కాదా?. 

చంద్రబాబుకు ఆ ఒప్పందాలను రద్దు చేసే దమ్ముందా? 

తాడేప‌ల్లి: వైయ‌స్ జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు ప‌న్నుతున్నార‌ని మాజీ మంత్రి పేర్ని నాని మండ‌ప‌డ్డారు.  వైయ‌స్‌ జగన్‌ను పతనం చేయాలనే కుట్రలో భాగంగానే చీకట్లో కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వైయ‌స్ జగన్‌పై 15 ఏళ్లుగా ఎల్లో మీడియా విషం చిమ్మనిరోజు లేదన్నారు. వైయ‌స్ జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఎన్ని కుట్రలు చేస్తున్నా వాటిని జగన్‌ పటాపంచలు చేస్తున్నారని పేర్ని నాని అన్నారు.

 చీకటి ఒప్పందాలు. విష ప్రచారాలు:
– తండ్రి మరణించాక జగన్‌గారు కాంగ్రెస్‌ పార్టీ సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛగా పార్టీని స్థాపించి రాజకీయాలకు సిద్ధమైతే.. అదే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు చీకట్లో అదే కాంగ్రెస్‌తో చేతులు కలిపారు.
– చంద్రబాబుకు కొమ్ము కాస్తూ తప్పుడు వార్తలు సైతం అచ్చేసే ప్రచార మాధ్యమాలు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి.. వైయస్‌ జగన్‌పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ గత 15 ఏళ్లుగా విషం చిమ్మని రోజు లేదు. 
– అయినా వారి విషపు రాతలు, రాజకీయ కుట్రలను పటాపంచలు చేస్తూ మా నాయకుడు వైయస్‌ జగన్, ఏ మాత్రం తగ్గకుండా మొక్కవోని ధైర్యంతో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. 
– ప్యారడైజ్‌ పేపర్లని, అర్థరాత్రి అమెరికా పోలీసులు వచ్చి పట్టుకెళ్లి పోతారని తప్పడు ప్రచారం చేసినా.. ప్రజలు ఆయన్ను  ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు 11 సీట్లకు పరిమితం చేసినా, 40 శాతం మంది ఓటేశారని, వారు కూడా లేకుండా చేయాలనే కుట్రతో చంద్రబాబు, ఆయన భజన మీడియా చేయని కుట్ర లేదు. రోజూ అలుపు లేకుండా ఆ రాక్షసులంతా దాడి చేస్తున్నారు. 
– రామోజీ పోయాక, తప్పుడు వార్తలు రాసి చంద్రబాబును కాసే పాత్ర ఆయన కొడుకు తీసుకున్నాడు.
‘జగన్‌కు ఆదాని లంచం రూ.1700 కోట్లు. జగన్‌ను ఆయన చీకట్లో మూడుసార్లు కలుసుకున్నారు. ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి. అంతర్జాతీయ స్థాయికి జగన్‌ అవినీతి’.. అంటూ, ఇంకా పుష్ప అంటే నేషనల్‌ కాదు.. ఇంటర్నేషనల్‌ అని ఈమధ్య సినిమాలో వచ్చింది. అది కూడా రాశారు. 

నిజానికి చంద్రబాబే ఏనాడో ఇంటర్నేషనల్‌:
– కానీ వారికి తెలియంది ఏమిటంటే చంద్రబాబు ఎప్పుడో ఇంటర్నేషనల్‌. సింగపూర్‌ కథ మర్చిపోయారా? ఆయనో పెద్ద పుష్పం. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ జైలుకి పోయాడు. అవన్నీ మీకు అసలు కనిపించడం లేదా?. 
– ఆర్బీఐ నియమాలు తుంగలో తొక్కి, చట్టాలను ఏమార్చి చీటీ కంపెనీ ముసుగులో ఊరూపా దొడ్డిదారిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు పోగేసి వేల కోట్లు మోసం చేసిన వీరు ప్రపంచానికి నీతులు చెబుతున్నారు!. ఏ రోజైనా ఇదే ఈనాడులో మార్గదర్శి పాపాల గురించి రాశారా? మీ గురించి కనీసం రాసుకున్నారా?.

అదానీ గ్రూప్‌పై అప్పుడలా.. ఇప్పుడిలా:
– ఇదే అదానీ గ్రూప్‌పై సీఎం చంద్రబాబు, గతనెల 24న చేసిన ట్వీట్‌ ఇది. ‘రాష్ట్రంలో అదానీ భారీ పెట్టుబడులు. ఐటీ, పర్యాటకం, పోర్టుల రంగంలో పెట్టుబడులు పెడతారు’ అని ఈనాడులో గొప్పగా రాశారు. ఇదే అదానీ గ్రూప్‌ పెద్దలు జగన్‌గారి హయాంలో వచ్చి కలిస్తే ఏం రాశారు?. ‘అడ్డగోలుగా అదానీకి. బొగ్గు టెండర్లు కూడా అదానీకే’ అని రాశారు.
– ఇంకా ఇదే అదానీ గ్రూప్‌ గత మా ప్రభుత్వ హయాంలో డేటా సెంటర్‌ పెడుతుంటే ఇదే ఈనాడులో ఏం రాశారు?. డేటా సెంటర్‌ను పెద్దగా ప్రస్తావించకుండా.. అదానీకి జగన్‌ 60 ఎకరాలు అని రాశారు. అంటే నిస్సిగ్గుగా అప్పుడలా.. ఇప్పుడిలా ఈనాడు రాతలు.

‘సెకీ’తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం:
– రాష్ట్రంలో జగన్‌గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, 2021, జనవరి 15న కేంద్ర విద్యుత్‌ శాఖ ఒక జీఓ జారీ చేసింది. సౌర, పవన (సోలార్‌ విండ్‌) విద్యుత్‌కు సంబంధించి రాష్ట్రాల మధ్య బదలాయింపు జరిగితే ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలు ఎత్తివేస్తామని అందులో పేర్కొన్నారు.
– ఆ తర్వాత అదే ఏడాది సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వానికి ‘సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌’ (ఎస్‌ఈసీఐ–సెకీ) ప్రతిపాదనలు పంపించింది. గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ద్వారా తాము యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49కే సరఫరా చేస్తామని వెల్లడించింది. ఆ మేరకు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ‘సెకీ’లో ఒప్పందం చేసుకుంది.
– వ్యవసాయానికి పగలే నాణ్యమైన విద్యుత్‌ దీర్ఘకాలం ఇచ్చేందుకు, ఏటేటా ఆ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. తక్కువ వ్యయంతో గ్రీన్‌ ఎనర్జీ ద్వారా ఆ విద్యుత్‌ను సరఫరా చేయాలని టెండర్లు పిలిస్తే, అప్పుడు టీడీపీ వారే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు.
– అప్పుడు కూడా సెకీ ద్వారా యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49కే కొనుగోలను తప్పుబడుతూ ఈనాడులో కథనాలు రాశారు. 

చంద్రబాబు ధర రూ.4.50. అయినా..:
– మరి అదే సెకీతో చంద్రబాబు ప్రభుత్వం 2016లో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. యూనిట్‌ విద్యుత్‌ రూ.4.50 చొప్పున, అది కూడా ఏకంగా 25 ఏళ్లపాటు కొనుగోలు చేసే విధంగా ఒప్పందం చేసుకుంది.
– అంత దీర్ఘకాలానికి ఏ ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకోదు. పైగా వాటితో పాటు, ఖర్చులు అదనం. అయినా ఈనాడుకు మాత్రం అది తప్పనిపించలేదు.

అది రాష్ట్ర శ్రేయస్సు. ఇది దోపిడినా!:
– యూనిట్‌ పవర్‌ రూ.4.50 చొప్పున, అదనపు ఖర్చులు కూడా భరిస్తూ, 25 ఏళ్లు కొనేలా చంద్రబాబు ఒప్పందం చేసుకుంటే, అది రాష్ట్ర శ్రేయస్సు కోసం.
– అదే విద్యుత్‌ను కేవలం రూ.2.49 చొప్పున కొనుగోలు చేసేలా, అది కూడా అదనపు ఖర్చులు భరించకుండా, జగన్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే.. అది దోపిడి అంటారా? అవినీతి జరిగిందంటారా?

చంద్రబాబు ప్రభుత్వంలో దారుణ (దోపిడి) ఒప్పందాలు:
– 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో విద్యుత్‌ ఒప్పందాలు చూస్తే..
– నాన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ. 133 ఒప్పందాలు. యూనిట్‌ రూ.4.84 చొప్పున. 3494 మెగావాట్లు. 25 ఏళ్లకు.
– సోలార్‌ పవర్‌. 36 ఒప్పందాలు. యూనిట్‌ రూ.6.99 చొప్పున. 1500 మెగావాట్లు. 25 ఏళ్లకు.
– ఇంకా అదే ఏడాది తెలంగాణ ప్రభుత్వం యూనిట్‌ పవర్‌ రూ.4.66కే ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. 
– విండ్‌ పవర్‌. యూనిట్‌ రూ.4.83కి. 3 వేల మెగావాట్లు. 25 ఏళ్లకు.
– దీనికి సంబంధించి కూడా అదే సమయంలో తమిళనాడు, గుజరాత్‌తో పాటు, కొన్ని రాష్ట్రాల్లో యూనిట్‌ పవర్‌ రూ.3.46కే ఇచ్చేలా, 25 ఏళ్లకు ఒప్పందాలు జరిగాయి. 
– మరి చంద్రబాబు ప్రభుత్వం.. ఎందుకు అధిక ధరలకు వెళ్లింది? ఆ మార్జిన్‌ మొత్తం ఎవరి జేబుల్లోకి వెళ్లినట్లు? దీనికి ఈనాడు సమాధానం చెప్పాలి. 
దీంతో పాటు, ఏపీ 2018–19 ఈఆర్సీ టారిఫ్‌ ఆర్డర్‌.. చంద్రబాబు పాపాలు చూస్తే..
– చంద్రబాబు ప్రభుత్వం హయాంలో విండ్‌ పవర్‌ యూనిట్‌కు రూ.4.63. మొత్తం 4 వేల మెగావాట్లు.
– సోలార్‌ పవర్‌ యూనిట్‌కు రూ.5.90. మొత్తం 3 వేల మెగావాట్లు.
– ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మీద వేసిన భారం కాదా?. 
– ఇన్ని పాపాలు చేసినా చంద్రబాబు అంటే ఆహా ఓహో అంటున్న ఈనాడు.. జగన్‌గారు ఎంత మంచి చేసినా కూడా దుర్మార్గుడు.. అవినీతి అని రాస్తోంది.

తప్పును ప్రశ్నించాలి. రాయాలి కదా?:
– సినిమాల్లో పరుచూరి గోపాలకృష్ణ ఒక పాత్రకు, ఈనాడుకు ఏం తేడా లేదు. చంద్రబాబుకు గడ్డి పెట్టాల్సింది పోయి, నిందలేస్తారా!. 
– జగన్‌గారి ప్రభుత్వం తక్కువ ధర యూనిట్‌ పవర్‌ను రూ.2.49కే కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుంటే.. దాన్ని అభినందిస్తూ.. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం, ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ ఒప్పందం చేసుకుంటే ప్రశ్నించాలి కదా? తప్పని రాయాలి కదా?. 
– కానీ ఈనాడు ఆ పని చేయదు. ఎందుకంటే, జనం సొమ్ముతో రామోజీ సంతాప సభ నిర్వహించినందుకు రుణం తీర్చుకున్నారు. ‘ఇస్తినమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం’ అన్నట్లుగా వారు జనం సొమ్మును ఇచ్చి పుచ్చుకుంటున్నారు.  

ఇదేనా సంపద సృష్టి అంటే?:
– నిజానికి విద్యుత్‌ రంగాన్ని నాశనం చేసింది చంద్రబాబు. కానీ, ఈరోజు కూడా నిస్సిగ్గుగా సంపద సృష్టిస్తానని చెబుతున్నాడు. ఇప్పటికి మూడుసార్లు సీఎం అయి, ఇప్పుడు నాలుగోసారి పదవిలో ఉన్న చంద్రబాబు ఇన్నేళ్లలో సృష్టించిన సంపద ఏది?
– రాష్ట్ర మొత్తం అప్పు రూ.6.46 లక్షల కోట్లుంటే, జగన్‌ ఒక్కడే రూ.14 లక్షల కోట్లు అప్పు చేశాడని పచ్చి అబద్ధాలు చెప్పుకొచ్చారు. 
– ఐదేళ్లలో కరెంట్‌ ఛార్జీలు పెంచనని ఓట్లు అడుక్కుని, ఈరోజు జగన్‌గారిపై నింద వేస్తూ, ఆయనను సాకుగాచూపుతూ రూ.17 వేల కోట్లకు పైగా భారం మోపుతున్నారు. ఇప్పటికే రూ.6వేల కోట్ల మోత మోపారు.
– పీ4 అంటే ఏమిటి? జనం మీద భారం మోపడమే సంపద సృష్టించడమా? డబ్బున్నోళ్లకి రాష్ట్రాన్ని అమ్మి పెట్టడమా?.
– కొత్త మెడికల్‌ కాలేజీలు, పోర్టులు, తమ వారికి దారాదత్తం చేయడం, ఐదు నెలల్లో రూ.50 వేల కోట్ల అప్పులు చేయడమా సంపద సృష్టి?.  

హామీల అమలు లేదు. అన్నింటా తిరోగమనమే:
– సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నాడు.. ఒక్క దానికి సరిగా నిధులు కేటాయించలేదు. జమిలి ఎన్నికలొస్తే ఇంకో ఏడాది కూడా ఉండవు.
– చంద్రబాబు పాలనలో కరెంట్‌ కంపెనీల నష్టాలు రూ.22,089 వేల కోట్లు. ఆ నష్టాలు రాష్ట్ర విభజన నాటికి కేవలం రూ.6 వేల కోట్లు మాత్రమే. ఇంకా చంద్రబాబు దిగిపోయే నాటికే కరెంట్‌ కంపెనీల అప్పులు రూ.56 వేల కోట్లు.
– అదే జగన్‌ పాలనలో ఐదేళ్లలో వాటికి సంబంధించి, రూ.395 కోట్ల నష్టాలు. రూ.36 వేల కోట్లు అప్పులు.
– ఇన్ని పాపాలు మూట కట్టుకుని కూడా ఏ మాత్రం సిగ్గు పడకుండా, కళ్లార్పకుండా పచ్చి అబద్దాలు చెబుతున్నాడు. 
– మరి ఎవరు బాగా పాలించినట్లు?. ఎవరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లు?.

ఈనాడుకు నా సవాల్‌:
– కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో జగన్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆదానీతో మాకేంటి సంబంధం?. కేంద్రం ఎవరి దగ్గర కొంటే మాకేంటి సంబంధం?. 
– ఇదే సెకీతో చంద్రబాబు యూనిట్‌ పవర్‌ రూ.4.50కి కొంటూ ఒప్పందం చేసుకుంటే, మేము కేవలం రూ.2.49కే కొంటూ ఒప్పందం చేసుకున్నాం. మరి ఎవరు గొప్ప? 
– వీటన్నింటికీ మీ వద్ద సమాధానం ఉందా? జగన్‌గారిపై చేసిన ఆరోపణలు, విమర్శలు నిరూపించగలరా?. ఆ దమ్ము మీకుందా?.

మాకేం సంబంధం? మీకేం బాధ?:
– జగన్‌ అరెస్టయిపోతాడు. అమెరికా పోలీసులు తీసుకెళ్లిపోతారని రాస్తున్నారు. అలా అరెస్ట్‌ చేయాల్సి వస్తే సెకీని, కేంద్రం నుంచి ఎవరు కొన్నారో వారిని తీసుకెళ్తారు. మాకేం సంబంధం?. మీకెందుకు బాధ?. – మేం మోదీ ప్రభుత్వం దగ్గర కొంటున్నాం. ఆయన ఎవరి నుంచి దాన్ని కొంటే మాకేంటి?. మాకు తక్కువ రేటుకు కరెంట్‌ కావాలి. అది మేం రైతులకు ఇవ్వాలి.
– ఆర్టీసీ కూడా ఆయిల్‌ను ఐఓసీ, బీపీసీఎల్‌ దగ్గర కొంటుంది. ఆ కంపెనీలు ఎక్కణ్నుంచి ఆయిల్‌ తెస్తే.. ఆర్టీసీకి ఏంటి?. ఆ కంపెనీలు రష్యా దగ్గర కొన్నా, ఉక్రెయిన్‌ దగ్గర కొన్నా ఆర్టీసీకి ఏం సంబంధం?.

– మీకిష్టమొచ్చినట్టు రాస్తే ఊరుకుంటామా? జగన్‌ ఉన్నప్పుడు ఇక్కడకు అదానీ వచ్చి వ్యాపారాలు పెడితే తప్పు. నేరం. అవినీతి. అదే చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చి లోకేశ్‌ని కలిస్తే ఆహా ఓహో అని రాస్తారు.. 
– చంద్రబాబు, ఈనాడు ఇచ్చిపుచ్చుకోవడంలో భాగంగానే నిరాటంకంగా  అబద్ధాలన్నీ అచ్చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. 

చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్‌:
– చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్‌ చేస్తున్నా. జగన్‌ చేసిన ఒప్పందాలు దమ్ముంటే రద్దు చేసుకోవచ్చు.
– మేం నిజాయితీగా పాలన చేశాం. ప్రజల సంక్షేమం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే ఒప్పందాలు చేసుకున్నాం. దమ్ముంటే అది నిజం  కాదని నిరూపించండి. 

– మొన్న లక్ష కోట్లన్నారు. చివరికి ఏమైంది?. రూ.1500 కోట్లు కూడా తేల్చలేకపోయారు. ఆ ఫైల్స్‌ మీద సంతకాలు పెట్టిన అధికారులే నిర్దోషులని కోర్టులు తీర్పులు చెబుతుంటే, ఇంకా జగన్‌కేం సంబంధం?. 
– కాంగ్రెస్, చంద్రబాబు కలిసి, జగన్‌పై తప్పుడు కేసులు పెట్టారని అందరికీ తెలిసిపోయింది. చంద్రబాబు, ఆయన రెండు పేపర్లు, అర డజన్‌ ఛానెళ్లు ఏ విధంగా జగన్‌గారిపై విషం చిమ్ముతున్నాయో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పేర్ని నాని తెలిపారు.

Back to Top