పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ 

పెద్దిరెడ్డిని చూస్తే చంద్రబాబుకు భయం.. అందుకే పీఏసీ ఛైర్మన్ కాకుండా అడ్డుకున్నారు

టీడీపీ ప్రభుత్వం తాళిబన్ల బాటలో నడుస్తోంది

దళిత నేతలకు రాష్ట్రంలో రక్షణలేదు

తాడేపల్లి: పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజుగా నిలిచిందని.. ప్రతిపక్షానికి రావాల్సిన పీఏసీ పదవిని రాకుండా అడ్డుకున్నారంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే ఖర్చులపై  పీఏసీ నిఘా ఉంటుందనే ఇలాంటి కుట్ర చేశారన్నారు. శుక్ర‌వారం ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం తప్పుడు‌ నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. అందుకే పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇస్తారు. 1985-86లో టీడీపీకి 30 సీట్లే వచ్చినప్పటికీ ఏరాసు అయ్యపరెడ్డికి పీఏసీ ఛైర్మన్ ఇచ్చారు. వంద సంవత్సరాల పీఏసీ చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు ఛైర్మన్‌గా వ్యవహరించారు. తగిన సంఖ్యా బలం లేకపోయినా పీఏసీ ఛైర్మన్‌గా ఇచ్చారు. బోఫార్స్ కుంభకోణం కూడా ఇదే పీఏసీ బయట పెట్టింది. స్పెక్ట్రం స్కాంని కూడా పీఏసీ ఛైర్మన్ మురళీ మనోహర్ జోషి బయటకు తీశారు. కోల్‌గేట్ కుంభకోణం వంటి అనేక అంశాలను పీఏసీనే బయటకు తీసింద‌ని చంద్రశేఖర్‌ గుర్తు చేశారు.

అలాంటి వ్యవస్థను ఏపీలో లేకుండా చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అప్పుడు అడ్డూ అదుపు లేకుండా స్కాంలు చేయొచ్చని భావిస్తున్నారు. ప్రతిపక్షానికి పదవి ఇవ్వనప్పుడు నామినేషన్ల వ్యవహారం ఎందుకు తెచ్చారు?. మా పార్టీ తరపున నామినేషన్ వేయటానికి వెళ్తే ఒక్క అధికారి కూడా అక్కడ లేరు. మూడు గంటలసేపు అక్కడ కూర్చోపెట్టి అవమానపరిచారు. మా హయాంలో ప్రతిపక్షానికే పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చాం. హుందాగా మేము వ్యవహరించాం. కానీ అలాంటి హుందాతనం కూటమి ప్రభుత్వంలో లేదు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూస్తే చంద్రబాబుకు భయం.. అందుకే ఆయనకి పీఏసీ ఛైర్మన్‌గా రాకుండా అడ్డుకున్నారు. మూడు కమిటీల్లో ఒక్కదానికి కూడా ప్రతిపక్ష సభ్యులను లేకుండా చేశారు. తద్వారా అడ్డగోలుగా దోపిడీ చేయాలని భావించారు. చివరికి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చారు. తాలిబన్లు మాత్రమే ఆ పదవిని వారి దగ్గర పెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం కూడా తాళిబన్ల బాటలోనే నడుస్తోంది. రాష్ట్రాన్ని తాలిబన్ల బాటలో నడిపిస్తున్నారు. దళిత నేతలకు రాష్ట్రంలో రక్షణలేదు. నందిగం సురేష్‌ని మూడు నెలలుగా జైలులో పెట్టి వేధిస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మాదిగలపై ఇలాంటి వివక్ష తగద‌ని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. 

Back to Top