పేదలంటే ప్రాణమిచ్చే జగనన్న

జగనన్న సంక్షేమ పథకాల చలవతో పేదరికం బాగా తగ్గిపోయింది :ఎంపీ నందిగం సురేష్‌

పేదలందరూ సంతోషంగా ఉండాలంటే మళ్లీ జగనన్నే సీఎం కావాలి : ఎంపీ తలారి రంగయ్య

జగనన్న సంక్షేమ పథకాల పేదల పాలిట వరాలు: ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి

జగనన్న మళ్లీ సీఎం కావాలి.. మన జీవితాల్లో వెలుగులు కొనసాగాలి: మాజీమంత్రి శంకరనారాయణ

175 కు 175 అసెంబ్లీ సీట్లలో గెలిపించి జగనన్నకు కానుకగా ఇవ్వాలి:ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు అలీ

గుంత‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో సామాజిక సాధికార యాత్ర

గుంతకల్లు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికారయాత్ర, బహిరంగ సభలు విజయవంతమయ్యాయి. బహిరంగ సభకు వేలాదిగా జనం తరలివచ్చారు. ఏర్పాట్లు బాగా చేయడంతో వచ్చిన ప్రజలు చివరి వరకు విసుగు లేకుండా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, నందిగం సురేష్, మాజీ మంత్రి శంకరనారాయణ, ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు అలీ, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ బోయ గిరిజమ్మ మాట్లాడారు. 

ఎంపీ నందిగం సురేష్‌
– అణగారిన జాతుల కోసం.. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల కోసం..  వారి మంచి కోసం కష్టపడుతున్న నాయకుడు జగనన్న.
–ఈ నాలుగున్నర  సంవత్సరాల్లో ..జగనన్న ప్రతి పేదవాడి పిల్లలు చదువుకోవాలని ఎంతగానో తపిస్తున్నారు.
– పేదపిల్లలు పెద్ద చదువులు చదివితే..వారి కుటుంబాల తలరాత మారిపోతుందని జగనన్న గట్టిగా నమ్ముతున్నారు. ఆ దిశలో బడి చదువుల్లో ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.
– ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు ఉన్నత పదవులిచ్చి సామాజిక సాధికారత అంటే ఏంటో చేసి చూపారు జగనన్న.
– జగనన్న సంక్షేపపథకాలు, ఆర్థిక సాయం వల్ల రాష్ట్రంలో గతంలో 12శాతం పేదరికం ఉండగా..ఇప్పుడు 4శాతానికి పడిపోయింది. పేదరికం రేటు విషయంలో ఇంత గణనీయ మార్పు రావడంపై ఆర్థికవేత్తలు సైతం ప్రశంసిస్తున్నారు.

ఎంపీ తలారి రంగయ్య
– జగనన్న అధికారంలోకి వస్తే మళ్లీ మళ్లీ బడుగు,బలహీనవర్గాలకు పదవులు వస్తాయి.
– సంక్షేమ పథకాలు ఆగకుండా వస్తాయి.
–పేదలకు బతుకు భరోసా ఉంటుంది. వారి పిల్లల చదువులు భారం కావు. అలాగే అనారోగ్యం పాలైన భయపడాల్సిన పనిలేదు. దిక్కుతోచని పరిస్థితిలో పడనక్కర్లేదు. – పేదలకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ జగనన్న పెద్ద అండగా ఉంటున్నారు. నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు.

ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి
– గతంలో ఏ ప్రభుత్వం చేయని మంచి పాలనను అందిస్తున్నారు జగనన్న.
–పేదవారికి, బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వరకు అనితర సాధ్యమైన సంక్షేమపథకాలు అందిస్తూ..అన్నిరకాలుగా వారి జీవనపరిస్థితులు గొప్పగా మారిపోయేలా చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు అలీ
–  175 కు 175 అసెంబ్లీ స్థానాల్లో వైయస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి జగనన్న కానుకగా ఇవ్వాలి.
– అది మన బాధ్యత. మనందరి బాధ్యత.
– అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగనన్న. పేదల పాలిట దైవం జగనన్న.  రైతులకు భరోసా జగనన్న
– ఆడపడుచులకు దేవుడిచ్చిన అన్నయ్య జగనన్న. వారి పిల్లల పాలిట ముద్దుల మామయ్య.

మాజీ మంత్రి శంకరనారాయణ
– ఈ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు అన్ని రంగాల్లోనూ పెద్దపీట వేశారు.
– చట్టసభల్లో పదవులతో పాటు, కార్పొరేషన్ల ఛైర్మన్లగాను, డైరెక్టర్లుగా చేసిన జగనన్న సామాజిక న్యాయమంటే ఏమిటో చేసి చూపారు.
– సామాజిక,రాజకీయ,ఆర్థిక రంగాల్లో ...బడుగు,బలహీనవర్గాల నుంచి వచ్చిన వారి స్థాయిని పెంచాలని చిత్తశుద్దితో కృషి చేస్తున్నారు జగనన్న.

జెడ్పీ ఛైర్మన్‌ గిరిజమ్మ
– మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బడుగు, బలహీనవర్గాలకు ఎంతో మేలు చేస్తున్నారు.
– సంక్షేమ పథకాలతో బడుగు బలహీనవర్గాల ఆర్థికస్థాయిని పెంచడమే కాకుండా, పదవులిచ్చి  రాజకీయ స్థాయిని పెంచారు. సామాజిక స్థాయిని పెంచారు.
– నాడు–నేడు పథకంతో అటు విద్యారంగంలోను, ఇటు వైద్యరంగంలోనూ అద్బుతమైన మార్పులకు శ్రీకారం చుట్టారు జగనన్న.
– పేదవారి జీవితాల్లో వెలుగులు పంచిన జగనన్న మళ్ళీ సీఎం కావాలి...అప్పుడే బడుగు,బలహీన, అణచివేయబడ్డ వర్గాలకు చెందిన ప్రజలంతా సంతోషంగా ఉంటారు.
 

Back to Top