విశాఖపట్నం: అనకాపల్లిలో ప్రేమోన్మాది చేతిలో కత్తిపోట్లకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న డిగ్రీ విద్యార్థిని భార్గవిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ సత్యవతి, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజులు ఆమె వెంట ఉన్నారు. భార్గవికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. భార్గవి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలికి అండగా ఉంటామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం ఎస్పీకి సూచించారు. దాడులను స్థానికులు అడ్డుకుంటే సగం నేరాలు తగ్గిపోతాయన్నారు.