వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త నాగ‌రాజుకు వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

ప‌ల్నాడు: ఏపీలో టీడీపీ మూక‌ల దౌర్జ‌న్యాలు కొన‌సాగుతున్నాయి. ప‌ల్నాడు జిల్లా తేలికుట్ల‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ నాగ‌రాజుపై ప‌చ్చ మూక‌లు దాడి చేశాయి. టీడీపీ గూండాల దాడిలో రెండు కాళ్లు కోల్పోయి మంచానికే ప‌రిమిత‌మైన  నాగ‌రాజు. విష‌యం తెలుసుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ..వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త నాగ‌రాజుకు ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీశారు. పార్టీ అండ‌గా ఉంటుంద‌ని నాగ‌రాజుకు భ‌రోసా క‌ల్పించారు.

పల్నాడు జిల్లా గురజాల మండలం తేలుకుట్లకు చెందిన చల్లా నాగరాజు తొలి నుంచి వైయ‌స్ఆర్‌సీపీలో చురుకైన కార్యకర్త. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామంలో పార్టీ తరపున పోలింగ్‌ ఏజెంట్‌గా వ్యవహరించాడు. దీంతో నాగరాజుపై కక్ష కట్టిన స్థానిక టీడీపీ నాయకులు, ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆయన్ను బెదిరిస్తుండడంతో, కూటమి నేతల నుంచి ప్రమాదం పొంచి ఉందని గ్రహించి, తేలుకుట్ల వదిలి పులిపాడు వచ్చి అక్కడే ఉంటున్నాడు.
    కాగా, గత నెల 20న, వ్యక్తిగత పనిమీద తేలుకుట్ల వెళ్లి పులిపాడు తిరిగి వస్తుండగా, గ్రామ శివారులోని గాడిదల వాగు వద్ద కాపుకాసిన 10 మంది టీడీపీ గుండాలు, నాగరాజుపై విచక్షణా రహితంగా కర్రలు, రాడ్లతో దాడి చేశారు. రెండు కాళ్లునూ నాలుగు చోట్ల విరగ్గొట్టారు. గురజాల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత, మెరుగైన చికిత్స కొరకు నర్సారావుపేట జీబీఆర్‌ ఆస్పత్రికి తరలించారు.
    నాగరాజు కుడి కాలు చికిత్స చేసే అవకాశం లేదని, మోకాలు కింద నుంచి కాలు తొలగించాల్సి వస్తుందని డాక్టర్లు భావిస్తున్నారు.
    కాగా, నాగరాజు పరిస్థితి తెలుసుకున్న శ్రీ వైయస్‌ జగన్, ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. నాగరాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వైయస్‌ జగన్, పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాగరాజుకు పూర్తి వైద్య సాయం చేయాలన్న శ్రీ వైయస్‌ జగన్, ఆయన్ను జాగ్రత్తగా చూసుకోమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని ఆదేశించారు.

Back to Top