తాడేపల్లి: మత ప్రబోధకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పాస్టర్, మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల మృతి అత్యంత బాధాకరమని వైయస్ జగన్ పేర్కొన్నారు. ప్రవీణ్ మరణంపై సన్నిహితులు, బంధువులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నందున దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.