కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించిన వైయ‌స్ జ‌గ‌న్‌

రిటైనింగ్‌ వాల్‌తోనే తప్పిన పెనుముప్పు.. 

వైయ‌స్ జగన్‌కు కృష్ణలంక వాసుల కృతజ్ఞతలు

తాడేపల్లి: విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్‌ వాల్‌ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  పరిశీలించారు.  ఆయన సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్‌ వాల్‌ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని  కృష్ణలంక వాసులు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఈ సంద‌ర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రిటైనింగ్‌ వాల్‌ లేకపోతే పూర్తిగా తమ జీవితాలు అతలాకుతలమయ్యేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వైయ‌స్‌ జగన్‌..  వైయ‌స్ఆర్‌సీపీ  శ్రేణులు సహాయ చర్యల్లో అండగా ఉంటారని బాధితులకు భరోసానిచ్చారు.

కాగా, మూడు రోజుల వైయ‌స్ఆర్ జిల్లా ప‌ర్య‌ట‌నను ముగించుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌  ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో వరద బాధిత ప్రాంతాల్లో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి మ‌ద్యాహ్నం పర్యటించనున్నారు. సింగ్‌నగర్‌ సహా బాధిత ప్రాంతాలను మధ్యాహ్నం మూడు గంటలకు పరీశీలించనున్నారు. 


 

Back to Top