విశాఖ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో వైయ‌స్ఆర్‌ పేరు తొలగింపు!

 ఆధునీకరణ పేరుతో మైదానంలో సర్కారు కుతంత్రం

బీచ్‌ తదితరచోట్ల వైయ‌స్ఆర్‌ వ్యూ పాయింట్లూ ఇప్పటికే ధ్వంసం

సర్కారు చర్యలతో క్రికెట్, వైయ‌స్ఆర్ అభిమానుల ఫైర్‌

విశాఖ‌ : నగరంలోని పీఎంపాలెం వద్దనున్న డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడి­యంలో మాజీ సీఎం వైయ‌స్ఆర్‌ పేరును పాలకవర్గం తొలగించింది. వైయ‌స్ఆర్‌ రాష్ట్రానికి అందించిన సేవలకు గుర్తుగా 2009 సెప్టెంబరు 14న అప్పటి ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆధ్వ­ర్యంలో ఏసీఏ–వీడీసీఏ స్టేడియాన్ని వైయ‌స్ఆర్‌ ఏసీఏ–­వీడీసీఏ స్టేడియంగా పేరు మార్చారు. అప్పుడు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది.

తాజాగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికా­రంలోకి వచ్చాక, ప్రధానంగా విశాఖలో వైయ‌స్ఆర్‌ గుర్తులు తుడి­చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా విశాఖ బీచ్‌ తదితరచోట్ల వైయ‌స్ఆర్‌ వ్యూ పాయింట్లు ధ్వంసం చేశారు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో పలుచోట్ల ఉన్న వైయ‌స్ఆర్‌ పేరును మరమ్మతుల పేరిట తొలగించేస్తున్నారు. ఈ చర్యపట్ల క్రికెట్‌ అభిమానులతోపాటు వైయ‌స్ఆర్‌ అభిమానులు మం­డిపడుతున్నారు. ప్రభుత్వం మార్కు తన పాలనలో చూపించాలిగానీ ఇలాంటి విధ్వంసకర విషయాల్లో కాదని ఆక్షేపిస్తున్నా­రు.

Back to Top