కర్నూలు జిల్లా: కోడుమూరు లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి నిప్పంటించారు. ఈ దుశ్చర్యలను వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం కర్నూలు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, వైయస్ఆర్‌సీపీ నాయకులు ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత విగ్రహాన్ని ధ్వంసం చేయగలరేమో కాని ప్రజల మనస్సులో నుంచి ఆయన పేరును తొలగించలేరన్నారు. ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విధ్వంసాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు.