`ఉచిత బ‌స్సు`..మ‌హిళ‌ల వినూత్న నిర‌స‌న‌

 తిరుప‌తిలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల అరెస్టు 

తిరుప‌తి:  కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చి మోసం చేయ‌డం ప‌ట్ల తిరుప‌తిలో మ‌హిళ‌లు వినూత్న నిర‌స‌న చేప‌ట్టారు. బుధ‌వారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలు..ఉచిత బ‌స్సు హామీ అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ భూమ‌న అభిన‌య్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో  మహిళలకు బస్సు ఎక్కి కూటమి ప్రభుత్వాన్ని నిల‌దీశారు.  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియో ను మ‌హిళ‌లు ప్రదర్శించారు. టికెట్ అడిగితే నా పేరు చెప్పండి సిఎం చంద్రబాబు వీడియో ను  తిరుప‌తి మేయర్ డాక్టర్ శిరీష చూపించారు.  ఉచిత బస్సు ప్రయాణం అమలులో లేదంటూ కండక్టర్ బ‌స్సును అలిపిరి పోలీస్ స్టేషన్ వ‌ద్ద ఆపి..పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్టీసీ బస్సును తిరుపతి ఎస్వీ యునివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న తిరుపతి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌ భూమన అభినయ్ రెడ్డి,మేయర్ శిరీష, టౌన్ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రరెడ్డి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు  గీత యాదవ్, మహిళా విభాగం నాయకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

Back to Top