

















మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ మాధవరావు
అమరావతి: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మాధవరావు ప్రశ్నించారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ మాధవరావు నిరుద్యోగభృతిపై మాట్లాడారు. నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇస్తున్నారని అడిగారు. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ప్రశ్నలకు మంత్రి రాంప్రసాద్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో రాంప్రాసద్ తీరుపై ఎమ్మెల్సీ మాధవరావు మండిపడ్డారు. గతంలోనూ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. 2014-2019లో ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ధ్వజమెత్తారు.ఇప్పుడు మరోసారి నిరుద్యోగ భృతిపై హామీ ఇచ్చి మరో మారు మాట తప్పిందని దుయ్యబట్టారు.