సునీతా, బారీ విల్మోర్‌ల‌కు వైయస్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

 తాడేప‌ల్లి: తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపిన  నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్మోర్ భూమిపైకి క్షేమంగా తిరిగి రావ‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. `సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ సుర‌క్షితంగా తిరిగి వ‌చ్చినందుకు అభినంద‌న‌లు. మీ సంక‌ల్ప శ‌క్తి, అంకిత‌భావం చూసి ప్ర‌పంచం గర్వపడుతుంది’ అని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ఎక్స్‌లో పేర్కొన్నారు. 

Back to Top