రజినీకాంత్‌ ద్వారా బీజేపీకి దగ్గరవ్వాలని చంద్రబాబు ప్లాన్‌

ఎన్టీఆర్‌ చివరి రోజుల్లో మాట్లాడిన మాటలు తెలుసుకో రజినీ..

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి  నందమూరి లక్ష్మీపార్వతి

విజయవాడ: చంద్రబాబుతో కలిసి రజినీకాంత్‌ కూడా వెన్నుపోటుదారుడిగా మారాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి  నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. రజినీకాంత్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్‌ చివరి రోజుల్లో మాట్లాడిన మాటలు తెలుసుకోవాలన్నారు. అవేమీ లేకుండా పుస్తకాలు రిలీజ్‌ చేసినంత మాత్రాన జనం నమ్మరన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలో రజినీకాంత్‌ చేసిన వ్యాఖ్యలకు నందమూరి లక్ష్మీపార్వతి కౌంటర్‌ ఇచ్చారు. బాలకృష్ణ రెండు సినిమాలు తీస్తే ఏమైందో.. రజినీకాంత్‌ మాటలకు కూడా అలాంటి స్పంద‌నే ఉంటుందన్నారు. 

ఇంకోసారి ఎన్టీఆర్‌ గురించి రజినీకాంత్‌ మాట్లాడితే సహించేది లేదన్నారు. వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు రజినీకాంత్‌ అండగా నిలిచాడని గుర్తుచేశారు. తర్వాత ఎన్టీఆర్‌ని కలిసి తాను తప్పు చేశానని క్షమించమని అడిగారన్నారు. వెన్నుపోటు ఎపిసోడ్‌లో రజినీకాంత్‌పై అనేక విమర్శలు వచ్చాయని, తమిళ పత్రికలు తీవ్రంగా విమర్శలు చేశాయని గుర్తుచేశారు. రజినీకాంత్‌ ద్వారా బీజేపీకి దగ్గరవ్వాలని చంద్రబాబు ప్లాన్‌ చేస్తున్నాడన్నారు. అనేక సర్వేల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనపై ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో చంద్రబాబు తట్టుకోలేక మళ్లీ సినిమావాళ్లతో డ్రామాలాడుతున్నాడన్నారు.  
 

Back to Top