పవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా

వైయ‌స్ఆర్‌సీపీ నేత అడపా శేషు  ప్ర‌శ్న‌

తాడేప‌ల్లి: లక్షల పుస్తకాలు చదివానంటున్న పవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా అని వైయ‌స్ఆర్‌సీపీ నేత అడ‌పా శేషు సూటిగా ప్ర‌శ్నించారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

- పవన్ కల్యాణ్, జగన్ గారి దగ్గర లక్షకోట్లు ఉన్నాయంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
 
- జగన్ గారి ఎన్నికల అఫడవిట్ లో ఆయన ఆస్తులు ఎంతో వివరంగా అధికారికంగా ప్రకటించారు.

- ఒక్కసారి ఎన్నికల కమీిషన్ వెబ్ సైట్ లోకి వెళ్తే తెలిసిపోతుంది.జగన్ గారి ఆస్తులు ఎంతో తేటతెల్లంగా ఉంటే ప్రజలలో అయోమయం సృష్టించేందుకు చంద్రబాబు మెప్పుకోసం లక్ష కోట్లు అంటూ పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు.

- అందర్ని ప్రశ్నించే పవన్ కి నా ప్రశ్న..ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు ప్రకటన ఉంటుంది చూసుకో .

- ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చూసి ఎన్నికల ప్రసంగాలు చదివే పవన్ కు ఈ విషయంలో స్ర్కిప్ట్ సరిగా రాసిచ్చినట్లు లేరు.అందుకే వివరం తెలియకుండా మాట్లాడుతున్నారు.

- 2014 లో చంద్రబాబుని పొగిడి 2019లో చంద్రబాబు,లోకేష్ ని తిట్టిన మాట నిజం కాదా.

- మళ్లీ నేడు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి కాపుకులాన్ని గంపగుత్తగా తాకట్టుపెట్టిన ఘనత పవన్ కల్యామ్ దే.

- చంద్రబాబు ఇచ్చే ప్యాకెజ్ కోసం నమ్ముకున్న కులాన్ని, జనసేన కోసం శ్రమిస్తున్న జనసైనికులని తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్.

- పార్టీ పెట్టి 14 ఏళ్ళులో 5ఏళ్ళు ప్రతిపక్షలో ఉండి  కష్టపడి జగన్ సీఎం అయ్యాడు.రెండేళ్ళు అటు ఇటుగా జనసేనను స్దాపించిన పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండుచోట్ల ప్రజల విశ్వాసం పొందలేకపోయాడు.

- ఇప్పుడు బిజేపి,టిడిపితో కలసి వచ్చినా ప్రజలు పవన్ కల్యాణ్ ను నమ్మే పరిస్దితి లేదు.

- పవన్ కల్యాణ్ కు ఆదరణ తగ్గడంతో సజ్జలగారు చిరంజీవిని ఏమీ అనకపోయినా చిరంజీవిని అంటే ఊరుకోనంటూ చిరంజీవిని సైతం ఇందులోకి లాగారు.

- చంద్రబాబు మెప్పుకోసం చిరంజీవిని సైతం రాజకీయంగా వినియోగించుకోవాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారు.

- పవన కల్యాణ్ కు పిఠాపురంలో ఎదురుగాలి వీస్తోంది.అందుకే పవన్ కల్యాణ్ లో ఆందోళన ప్రారంభమైంది.

- రాష్టంలో దమ్మున్న నాయకుడు జగన్..ఆంధ్రప్రదేశ్ లో సచివాలయాలు,వాలంటీర్లు వంటి కొత్త సంస్కరణలు తెచ్చి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసాడు.

- పార్టీ పెట్టి 14 ఏళ్ళులో 5ఏళ్ళు ప్రతిపక్షలో ఉండి  కష్టపడి జగన్ సీఎం అయ్యాడు.

- రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే జగన్ ని ఏమని ప్రశ్నిస్తావ్ పవన్.

- గతంలో టీడీపీ జన్మభూమి కమిటీల పేరుతొ అవినీతి చేస్తుంటే చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించలేదు.

- కాపు రిజర్వేషన్ అంశంపై ముద్రగడ, చంద్రబాబుకి లేఖ రాస్తే అప్పుడు పవన్ ఎక్కడ ఉన్నాడు.

- సిగ్గు,శరం లేని పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతిలో కీలు బొమ్మ అయ్యాడు. సిద్ధంసభలు చుస్తే పవన్ కళ్యాణ్ కి జగన్ గారికి ఉన్న ఆదరణ ఏంటో అర్ధం అవుతుంది.

- అన్ని పార్టీలు జత కట్టినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు.జగన్ మీద దాడి చేసేదాక మీ రాజకీయాలు దిగజారిపోయాయి.

- కాపు సంఘాలు,నాయకులు అర్ధం చేసుకోండి..జగన్ వల్లనే కాపులు అభివృద్ధి చెందుతారు.అసెంబ్లీ టిక్కెట్ల పరంగా చూసినా,మంత్రివర్గంలో కేటాయించినా స్దానాలు చూసినా జగన్ గారి చిత్తశుద్ది అర్దం అవుతుంది.

- 2014,2019,2024 మూడో సారి పవన్ కళ్యాణ్ కి ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.

- సిగ్గులేకుండా చిరంజీవిని పవన్ కళ్యాణ్ తెర మీదకి తీసుకువస్తున్నాడు.

- చిరంజీవి అంటే వైయ‌స్‌ జగన్ కి చాలా గౌరవం ఉంది.

- చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలో కాపులకు నిధులు అధికంగా విడుదల చేయడం జరిగింది.
కాపు నిధుల అంశంలో చర్చకి పవన్ కళ్యాణ్ సిద్ధమా.

- సంక్షేమ పథకాలతో కాపు మహిళలు  సైతం అభివృద్ధి చెందారు.

- వంగవీటి రంగా మరణానికి కారణం చంద్రబాబు, అలాంటి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు.

- కాపులకి చంద్రబాబు,పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నారు కాపులు గమనించాలి

Back to Top