హైదరాబాద్: ఎల్లో మీడియా సృష్టించిన వ్యక్తే చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆయనను ఎల్లోమీడియా ఆకాశానికి ఎత్తుతుందని, వైయస్‌ఆర్‌సీపీపై దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు– రాధాకృష్ణ సంభాషణ వారి దుర్మార్గానికి నిదర్శనమన్నారు. సోమవారం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కుల మీడియా సృష్టించిన వ్యక్తి మాత్రమే. రాష్ట్రంలో కుల పత్రికలు, కుల మీడియా వారం రోజుల పాటు చంద్రబాబును చూపించనట్లు అయితే 8వ రోజు చంద్రబాబు ఉండరు. ఆయన కులమీడియా సృష్టించిన వ్యక్తే ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. దశాబ్ధాల పాటు చంద్రబాబును ఆంధ్రజ్యోతి, మిగతా ఇతర కుల మీడియా ఆకాశానికి ఎత్తుతూ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ప్రచారం చేస్త..ఆయన ఏం చేసినా కూడా అది అద్భుతం అన్నట్లుగా ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. అదే సమయంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి చొచ్చుకుపోతుంటే..ఈ కుల మీడియా అసభ్య, దుష్ప్రచారం చేస్తుంది. దీన్ని బట్టి ఒక్కటి అర్థం చేసుకోవచ్చు. నిజానికి రాధాకృష్ణ జర్నలిస్టు అని నేను ఒప్పుకొను. కొన్ని దశాబ్ధాల క్రితం రాధాకృష్ణ ఒక లాండ్రిటా స్కూటర్‌లో సాధారణమైన న్యూస్ కలెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఈ రోజు ఆయన ఆస్తి రూ.50 వేల కోట్లు ఉంటుంది. ఈ స్థాయికి దిగజారడానికి ఆయన చేసిన అక్రమాలు, అవినీతి, అరాచకాలు తోడ్పడ్డాయి. విశాఖపట్నంలో ఒక ఇంటి ఓనర్‌కు, అద్దెకు ఉండే వ్యక్తికి మధ్య వివాదం వస్తే..ఆ వివాదాన్ని వైయస్‌ఆర్‌సీపీ చేసినట్లుగా ఈ కుల మీడియా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సృష్టించారు. అది పోలీసులు ఖండించినా, మేం ఖండించినా కూడా ఈ రోజుకు కూడా పదే పదే చెబుతున్నారు. నిన్న తాను మాట్లాడినట్లుగా ఒక ఆడియోను సృష్టించారు. అది నా వాయిస్సే కాదు. ఆ వాయిస్‌ను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని రాధాకృష్ణ చెబుతున్నారు. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పోలీసులు మాత్రమే పంపించగలరు. రాధాకృష్ణ ఎంత దుర్మార్గుడో అర్థం చేసుకోవచ్చు. మరోఘట్టం నిన్న వెలుగులోకి వచ్చింది. ఎదుటివ్యక్తి యుద్ధం ప్రకటించారు. వెనుక తిరిగేతత్వం వైయస్‌ఆర్‌సీపీకి లేదు. యుద్ధంలో పోరాటం చేయడమే వైయస్‌ఆర్‌సీపీకి తెలుసు. నిన్న రాధాకృష్ణ–చంద్రబాబు సంభాషణ బయటకు వచ్చింది. వీరు ఎంత దుర్మార్గులో ఈ సంభాషణ చెబుతుంది.