దేవుడికే దిక్కు లేదు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

పట్టుబడిన బంగారం ఎవరిది?

టీటీడీది అయితే ఎందుకు పట్టుబడింది

ఈ బంగారంపై టీటీడీ ఎందుకు మాట్లాడటం లేదు?

హైదరాబాద్‌: రాష్ట్రంలో దేవుడికే దిక్కు లేదని, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని  వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం చెన్నైలో పట్టుబడిన బంగారం ఎవరదని, టీటీడీది అయితే అలా ఎందుకు తరలించాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై టీటీడీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. గురువారం వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు.  టీటీడీ అధికారులు నోరు మెదపకపోవడం, దీనికి సంబంధించి మాట్లాడేందుకు నిరాకరించడం ఏమి సూచిస్తుందని ప్రశ్నిస్తున్నాం. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపించి వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద ఎత్తున చెన్నైలో తిరుమల బంగారం పట్టుబడితే టీటీడీ ఈవో, చైర్మన్‌ ఎందుకు స్పందించకపోవడం లేదు. ఇందులో దాగి ఉన్న మతలబు ఏంటి? ముఖ్యమంత్రి అనేక విషయాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బంగారం రోడ్లపై పట్టుబడితే..సెక్యురిటీ లేకుండా, ఎలాంటి ్ర«ధువీకరణ పత్రాలు లేకుండా టీటీడీ బంగారాన్ని తరలిస్తున్నారంటే దాని అర్థం ఏంటి. ఒక పవిత్రమైన దేవాలయం బంగారం విషయంలో ఇంత వివాదం జరగాల్సిన అవసరం ఏముంది? భక్తులు భక్తీభావంతో సమర్పించే బంగారానికి లెక్కా పత్రం లేకుండా పట్టుబడితే దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం ఏంటి? దీన్ని అనధికారికంగా ఏమైనా తరలిస్తున్నారా? తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంటుంది. వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి రావాలని మేం కోరుతున్నాం. ఎవరూ కూడా స్పందించకపోవడం బాధ్యతారాహిత్యం అవుతుంది. ఆ బంగారం ఎవరిది? టీటీడీది అయితే ఎందుకు పట్టుబడింది? రెండు రోజులు గడుస్తున్నా ఎవరు స్పందించడం లేదు. టీటీడీ బంగారానికి లెక్కా జమా లేకుండా పోయింది. దేవుడికే దిక్కు లేకపోతే రాష్ట్రంలో ఎవరికి దిక్కుంది. ఈ వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి రావాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండు చేసింది. అన్ని వివరాలను ప్రజల ముందు ఉంచాలని వాసిరెడ్డి పద్మ డిమాండు చేశారు.
 

Back to Top