టీడీపీకి చెందిన వ్యక్తి అని ఏ పథకమైనా ఆగిందా?

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స‌వాల్‌

ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ప్ర‌తి ప‌థ‌కాన్ని అమలు చేసిన నాయకులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

ఎల్లోమీడియా టీడీపీ కరపత్రం స్టేజ్‌ దాటిపోయింది

 నాడు కనీసం చంద్ర‌బాబు ఒక పథకాన్ని అయినా పూర్తిగా అమలు చేశారా?

సీఎం వైయ‌స్ జగన్‌ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు

సాధికార యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే టీడీపీ, ఎల్లోమీడియా మాత్రం తప్పుడు ప్రచారం

 చంద్రబాబు, లోకేష్‌ తలకిందులుగా తపస్సు చేసినా ఇలాంటి స్పందన రాదు: స‌జ్జ‌ల‌

తాడేప‌ల్లి: టీడీపీకి చెందిన వ్యక్తి అని ఏ పథకమైనా ఆగిందా? అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కు స‌వాల్ విసిరారు.  పూర్తి చేసిన అంశాలు, అమలైన పథకాలు వదిలేసి, ఏవేవో మాట్లాడతారని ఆయన మండిప‌డ్డారు. మా ప్ర‌భుత్వం ఏది నష్టం చేసిందో కచ్చితంగా మాట్లాడలేరని.. ఆసుపత్రుల్లో ఓపీలు తగ్గిపోయాయి అని హాస్యాస్పదంగా మాట్లాడతారని విమర్శించారు. చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీ అంటే, పెద్ద పెద్ద బిల్డర్లకు ఇసుక ఎలా వెళ్ళిందని ప్రశ్నించారు. ఉచిత జేసీబీ, క్రేన్ పధకాలు చంద్రబాబు ఏమైనా పెట్టాడా అంటూ సజ్జల ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక అయితే దెందులూరు ఎమ్మెల్యే ఎందుకు ఎమ్మార్వో జుట్టు పట్టుకున్నాడని ప్రశ్నించారు. సోమ‌వారం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఏమ‌న్నారంటే..

టీడీపీ వారికి ఒక్కరికైనా సంక్షేమం ఆగిందా?
– ప్రజల్లో విశ్వసనీయత సంపాదించినప్పుడే మనకు ప్రజల ఆశీస్సులు కోరే హక్కు ఉంటుంది. 
– ఈ విషయాన్ని మనసా వాచా నమ్మినందువల్లనే జగన్‌ గారు మేనిఫెస్టోను పవిత్రంగా చూసుకున్నారు. 
– మేనిఫెస్టో తయారీ వద్ద నుంచి ప్రజల వద్ద అభిప్రాయాలు తీసుకుని..అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేశారు. 
– అధికారంలోకి వచ్చాక తూతూ మంత్రంగా కాకుండా వివక్షకు అవకాశం లేకుండా అమలులో పెట్టారు. 
– వివక్ష ఉంటే అవినీతికి అవకాశం వస్తుంది..దానికి అవకాశం లేకుండా శాచురేషన్‌ పద్ధతితో పథకాలను అందించారు. 
– చంద్రబాబులా అలవికాని హామీలు ఇచ్చి తర్వాత అమలు చేయకుండా పారిపోయే పద్ధతిని మార్చిన వ్యక్తి శ్రీ వైఎస్‌ జగన్‌. 
– శాచురేషన్‌ అనే పదం రాజశేఖరరెడ్డి గారి హయాంలో వెలుగులోకి వస్తే ఈ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అమలు చేశారు. 
– అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకున్నారు. 
– ఒకసారి హామీ ఇచ్చిన తర్వాత దాన్ని ఆపేయకుండా, ఎన్నికలప్పుడు మళ్లీ తెరమీదకు తీసుకురావడం కాకుండా కంటిన్యూగా అమలు చేశారు. 
– క్యాలెండర్‌ నిర్ధేశించి లబ్ధిదారులకు ముందే చెప్పి పథకాలను అందించారు. 
– ఇదంతా ఒక సారి చేసిన తర్వాత నాలుగున్నరేళ్లలో పాలనలో సమూల మార్పులు వచ్చాయి. 
– డోర్‌ స్టెప్‌కు పాలన చేరడం, ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు కింది స్థాయికి వెళ్తున్నాయి. 
– టీడీపీ సానుభూతిపరులకు గానీ, ఆ పార్టీ వారికి గానీ ఒక్కరికైనా సంక్షేమం ఆగిందా? 
– చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా.. ఆయన్ను నెత్తిన పెట్టుకున్న రామోజీ, రాధాకృష్ణలకు..పవన్‌ కల్యాణ్‌లకు కూడా ఇదే ప్రశ్న. 
– 2014–19 మధ్య ఇలాంటి ఆలోచనలు చేశారా? జన్మభూమి కమిటీల ద్వారా దోచుకున్నారే తప్ప చేసిందేమీ లేదు. 
– ఈ చాలెంజ్‌ మేం ఎన్నో సార్లు చేశాం..కానీ సమాధానం మాత్రం రాలేదు. 

టన్నుల కొద్దీ విషాన్ని చిమ్ముతున్న రామోజీ, రాధాకృష్ణ:
– ఆ రెండు మీడియా సంస్థలు నిరంతరంగా న్యూస్‌ను న్యూస్‌లా ఇవ్వాలనే స్థాయిని దాటి పోయి...వ్యూస్‌ను రుద్దే స్టేజ్‌ దాటి...కేవలం టన్నులు కొద్దీ విషాన్ని జగన్‌ గారిపై, ఆయన పాలనపై, ఆయన పార్టీపై చిమ్ముతున్నారు. 
– టీడీపీ అభిప్రాయాలను రుద్దాలనే స్థాయి దాటిపోయి..కరపత్రాల స్థాయి దాటిపోయి టీడీపీ మార్గనిర్ధేశకులుగా మారిపోయారు. 
– కరపత్రాల స్టేజ్‌ దాటిపోయి కరదీపికలుగా మారాయి. 
– మీడియా అనే ముసుగులో ఆ పత్రికలు నిరంతరం విషం కక్కుతూనే ఉన్నాయి. 
– జగన్‌ గారు 99 శాతం చేస్తే ఆ ఒక్క శాతం మీద విషపు రాతలు రాస్తారు. 
– నాడు నేడు పనుల్లో మొదటి దశను వదిలేసి రెండో దశలో టేకప్‌ చేస్తున్న వాటిపై రాస్తారు. పూర్తయిన పనులు మాత్రం చూపించరు. 
– ఇన్ని పథకాలు ఇస్తుంటే..ప్రజలకు ప్రయోజనం కలిగిస్తున్న పథకాల గురించి ఒక్కటీ చెప్పరు. 
– దానికి తోడు వంద పథకాలు ఆపేశారంటూ రాతలు రాస్తారు తప్ప వారి హయాంలో చేసిన ఒక్క పథకం గురించి కూడా చెప్పలేరు. 
– అసలు వారు ఏదన్నా పథకం పూర్తిగా అమలు చేస్తే కదా మేం ఆపడానికి? 
– జన్మభూమి కమిటీలు రద్దు చేసినందు వల్ల నష్టం జరుగుతోందంటే పోనీ వారి పార్టీ స్టాండ్‌ అనుకోవచ్చు. 
– పొద్దున లేస్తే టీడీపీ నాయకులు మాట్లాడటానికి నాలుగు స్టోరీలు వేయడం, ఎన్నికల కమిషన్‌పై వత్తిడి తీసుకురావడం వంటివి చేస్తూనే ఉన్నారు. 
– తమ అవినీతిని కవర్‌ చేసుకోడానికి ఇక్కడేదో ఘోరాలు జరుగుతున్నాయంటారు. 

పథకాల ప్రయోజనాల గురించి మాత్రం చర్చించరు:
– పథకాల వల్ల ప్రయోజనాలు పొందుతుంటే వాటి గురించి చర్చించరు కానీ..అర్హత లేని ఒకరిద్దరినీ పట్టుకుని హంగామా చేస్తారు. 
– వారిని కూడా వీళ్లే తీసుకెళ్లి చెప్పిస్తుంటారు. 
– బోధనాసుపత్రుల్లో ఓపీలు తగ్గిపోయాయి అంటూ రాతలు రాశారు. 
– ఫ్యామిలీ డాక్టర్‌ వల్ల డోర్‌ స్టెప్‌ వద్దకు వెళ్లడం వల్ల ఓపీలు తగ్గిపోయాయి. 
– తలకాయ ఉండేవాడు, మంచి బుద్ది ఉన్నోడైతే ఓపీలు తగ్గిపోయాయని రాయడం అంటే ఆస్పత్రులన్నీ కళకళలాడాలని కోరుకుంటున్నారా? 
– బోధనాసుపత్రులకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది. వాళ్లు నిష్పక్షపాతంగా ఉండి ఉంటే ఇలాంటివి రాయవచ్చు. 
– ఒకప్పుడు ఎరువుల కోసం కిలోమీటర్ల మేర క్యూలలో రైతులు నిలబడేవారు. 
– కానీ ఇప్పుడు ఆ కళే కనిపించడం లేదంటూ రాస్తే ఇక వారిని ఏమనాలి?  ఆపైత్యం ఎక్కడకు వెళ్తోంది? 
– మీడియాలో ఉగ్రవాదం అనే స్థాయిని దాటిపోయి అత్యంత నీచమైన స్థాయికి దిగజారారు. 
– ఎప్పటికప్పుడు మేం చెప్తూనే ఉన్నాం..పరువునష్టం వేస్తున్నాం..అయినా ఆ స్థాయి దాటిపోయి బరితెగించారు. 

సచ్ఛీలుడివైనట్లు ప్రవచనాలు వల్లిస్తే ఎలా రామోజీ..?:
– రామోజీ రావు అక్రమంగా ప్రజల నుంచి వచ్చిన సొమ్మునే పెట్టుబడిగా పెట్టి మహాసౌదాన్ని కట్టుకున్నాడు. 
– వేల ఎకరాల ఫిల్మ్‌ సిటీ, వెలుగులోకి రాని అక్రమాస్తులు వంటివి అనేకం. 
– రూపాయి దానికి ఐదు పైసలు కూడా ఇవ్వకుండా ఆస్తులు రాయించుకున్న కేసులు ఆయనపై చాలా ఉన్నాయి. 
– అలాంటి వ్యక్తి ఉదయం లేచినప్పటి నుంచీ ఈనాడు ద్వారా ప్రవచనాలు పలుకుతూ విషం చిమ్ముతూ బట్టలన్నీ వదిలేశాడు. 
– అసలు వారి రాసే తప్పుడు రాతలకు ఎన్నింటికి జవాబులు ఇవ్వాలో కూడా అర్ధం కావడం లేదు. 
– సింపుల్‌ ప్రశ్న..2014–19 మధ్య చంద్రబాబు నువ్వు ఉచితంగా ఇసుక విధానంలో కేవలం ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలే వసూలు చేయాలి. మరి పెద్ద పెద్ద బిల్డర్లకు ఇసుక ఎవరిచ్చారు..? 
– ఆనాడు చంద్రబాబు ఇంటి పక్కనే డ్రెడ్జర్లు, జేసీబీలు, క్రేన్లు పెట్టి ఇసుకను తరలించారు. 
– ఈ తీరు రాష్ట్రమంతా ఎక్కడ చూసినా కనిపించింది. 
– ఉచితమే అయితే దెందలూరులో మీ ఎమ్మెల్యే..ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని లాగేయడం ఎందుకు జరిగింది? 
– ఎన్జీటీ ఎందుకు నీకు వంద కోట్ల పెనాల్టీ వేసింది..? 
– నువ్వు ఉచితంగా ఇసుక ఇస్తే ఇవన్నీ ఎందుకు జరిగాయి..? 
– నేడు పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తూ ఇసుకను అప్పగిస్తున్నాం. 
– పచ్చళ్ల వ్యాపారం చేసే నువ్వు కూడా పాల్గొనమని చాలా సార్లు చెప్పాం. 
– అది వదిలేసి ఎవరెవరో వచ్చి ఏదో చేస్తున్నారంటూ రోజూ వార్తలు రాస్తూనే ఉన్నారు. 
– దీన్ని జ్యుడిషియల్‌ ప్రివ్యూకి ఎందుకు పంపలేదు అంటారు. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లినప్పుడు ప్రివ్యూకి వెళ్తుందన్న విషయం కూడా వారికి తెలుసు. అయినా తప్పుడు వార్తలు రాస్తూనే ఉంటారు. 
– మనం కండిషన్స్‌ పెట్టి కాంట్రాక్టర్లను ఆహ్వానించిన తర్వాత దీంట్లో జ్యుడిషియల్‌ ప్రివ్యూ అవసరం ఏముంది? 
– ఏడాది తిరిగే సరికి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సొమ్ము ఇస్తున్నాడా లేదా అనేది చూడాలి. 
– వారు చెప్తున్న జ్యుడిషియల్‌ ప్రివ్యూ విధానాన్ని తీసుకొచ్చింది కూడా జగన్‌ గారేనన్న విషయాన్ని మర్చిపోయినట్లు నటిస్తున్నారు. 
– ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండాలనే ఈ విధానాన్ని పెట్టుకున్నాం. 
– ఎక్కడైతే కాంట్రాక్టర్‌కి ఎక్కువ లబ్ధి కలిగించే స్కోప్‌ ఉంటే అక్కడ అవినీతికి అవకాశం ఉంటుంది. దానిపై మీరు రాస్తే ఓకే. 
– కానీ ముందుగానే జగన్‌గారు తనకాళ్లకు తాను బంధం వేసుకుని ఎక్కడికక్కడ గైడ్‌లైన్స్‌ పెట్టి చేస్తే దాన్ని చూపించి రాతలు రాస్తావు.

బాబు హయాంలో అక్రమాలపై మీ రాతలు ఏమయ్యాయి..?:
– 2014–19 మధ్య కిక్కురమనని రామోజీ, రాధాకృష్ణలు ఆనాటి విధానంపై రాతలు ఎందుకు రాయలేదు..? 
– పాత రికార్డులను చూస్తే తెలుస్తుంది..పోలవరంలో చివరికి బ్యాంకు గ్యారెంటీకి కూడా ప్రభుత్వమే షూరిటీ ఇచ్చాడు. 
– చేయని పనికి కూడా ముందే అడ్వాన్స్‌ ఇచ్చాడు..మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ పేరుతో రూ.700 కోట్లు ఇచ్చేశారు. 
– అన్నిటికంటే ఘోరం నవయుగ వారిని తీసుకొచ్చి కాంట్రాక్టు ఇచ్చేశాడు. 
– తవ్వుకుంటూ వెళ్తే ఇలాంటివి ఎన్నో వస్తాయి..వీటిని రామోజీ, రాధాకృష్ణలు ప్రశ్నించారా? 
– అఖరకు సిగ్గు లేకుండా హెరిటేజ్‌ మజ్జిగ టెండర్‌ను కూడా కొట్టేశారు కదా..!
– ఈ రోజు జగనన్న ఇళ్ల పథకానికి సిమెంట్‌ ధరలు తగ్గించాలి..లబ్ధిదారులకు మంచి జరగాలని ప్రభుత్వం మంచి ప్రయత్నం చేసింది. 
– దానిలో భాగంగా అన్ని సిమెంట్‌ కంపెనీలతో పాటు భారతి సిమెంట్స్‌ కూడా తక్కువ ధరకు అందించింది.  
– నీలా మజ్జిగ, పాలు, నెయ్యిలో కూడా ఎలా దండుకోవాలని చూడకుండా మేం సిమెంట్‌ ధరలు తగ్గించాం. 
– అలా ధర తగ్గించడం వల్ల అన్ని సిమెంట్‌ కంపెనీలతో పాటు భారతీ సిమెంట్స్‌ కూడా నష్టపోయింది. 
– దాని గురించి మేం ఏనాడూ బయట కూడా చెప్పుకోవడం లేదు. 
– నువ్వు సిగ్గు లేకుండా ప్రభుత్వం నుంచి దోచేశావు. మరుగుదొడ్ల నిర్మాణంలో పసుపు రంగు వేయడం నుంచి నీరు చెట్టూ వరకూ అడ్డంగా దోచేశావ్‌. 
– అలాంటి చంద్రబాబు వీళ్లకు హీరోలా కనిపిస్తున్నాడు. ఆనాడు వీళ్లు ఒక్క రోజు కూడా ప్రశ్నించలేదు. 
– ఈ రోజు అంతా పారదర్శకంగా జరుగుతుంటే..ఈ ప్రభుత్వాన్ని, జగన్‌గారిని ప్రశ్నిస్తున్నారు. 
– వాళ్లు కావాలనే చేస్తున్నారు..మేం ఎంత చెప్పినా వారికి తలకెక్కదు. ప్రజలు గమనించాలని మేం కోరుతున్నాం. 

చివరికి రాజకీయాన్ని వ్యభిచారంలా చేస్తున్నారు:
– రాజకీయం సంప్రదాయ బద్ధంగా ఉన్నా పర్లేదు...ఆ స్థాయి దాటిపోయి వ్యాపారం అయిపోయింది. 
– ఆఖరకు వ్యభిచారంలా చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో రహస్యంగా ఏం చేస్తున్నారో తెలియదు. 
– ఇక్కడా రహస్య పొత్తులు పెట్టుకుంటారు. మీడియా ద్వారా పది మందిని ప్రమోట్‌ చేయించి వారితో పార్టీలు పెట్టిస్తారు. 
– ప్రజలకు సంబంధం లేని రాజకీయం చేస్తూ...ప్రజలకు సబంధం లేని నీచమైన కల్పిత గాథలతో విషం కక్కుతున్నారు. 
– అదే ఒక గొప్ప ఎత్తుగా చూపుతున్న వీరు చేస్తున్న దాన్ని రాజకీయ వ్యభిచారం అంటారు. 
– ప్రజా రాజకీయం చేయాలి...అప్పుడు ప్రజలకు చాయిస్‌ దొరుకుతుంది. 
– కన్ఫ్యూజ్‌ చేయడం, ఆ కన్ఫ్యూజన్‌ నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. 
– ఎన్నికలు దగ్గర పడే కొద్దీ విషప్రచారం ఊపందుకుని రోజూ అబద్ధపు రాతలు రాస్తున్నారు. 
– మేం రోజూ ఫ్యాక్ట్‌ చెక్‌  ద్వారా చెప్తున్నాం..ఇదీ నిజం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. 

జనాన్ని చూసి జీర్ణించుకోలేక ఖాళీ కుర్చీలంటూ రాతలు:
– ఇప్పటికి 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేం సామాజిక సాధికార యాత్ర జరిపాం. 
– దానికి సంబంధించి రోజూ కాళీ కూర్చీలంటూ ఆ రెండు పత్రికలు రాస్తూనే ఉంటాయి. 
– కుర్చీలు వేసిన తర్వాత జనం రాకముందు, వెళ్లిపోయిన తర్వాత కాళీగానే ఉంటాయి. దాన్ని ఫోటోలు తీసి వేస్తారు. 
– అక్కడకు వస్తున్న జనాన్ని ప్రపంచం మొత్తం చూస్తోంది..దాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి రాతలు రాస్తున్నారు. 
– ప్రజల్లో మమేకమై ప్రజా సేవ చేస్తే ప్రజలు ఎలా బ్రహ్మరథం పడతారో ఆ యాత్రలో కనిపిస్తోంది. 
– చంద్రబాబు ఏ రోజూ అలాంటివి చేసే ప్రయత్నం కానీ, చేయాల్సిన అవసరం ఉందన్న ఆలోచన కానీ చేయలేదు. 
– అలాంటి బాబు ఈ రోజు కాళీ కుర్చీలంటూ తన పత్రికల్లో వేయిస్తున్నాడు. 
– అక్కడకు వస్తున్న జనాన్ని మిగిలిన మీడియా అంతా వేస్తోంది కానీ..పచ్చ విషం ఉన్న ఈ పచ్చ పత్రికలు మాత్రం వక్రీకరిస్తున్నాయి. 
– ఈనాడు, ఆంధ్రజ్యోతి పాఠకులు ఈ ప్రశ్నలన్నిటిపై ఆలోచించాలి. 
– ఇవన్నీ నియోజకవర్గ స్థాయి మీటింగులు మాత్రమే.వాటికే అంత జనం వచ్చారు. 
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు ముందుండి సాగుతున్న యాత్రలు...సభలు అవి. ఇది దేనికి చిహ్నమో ఆలోచించాలి.
– మీ జన్మకు నువ్వు కానీ, నీ కొడుకు కానీ ఇంతమంది జనాన్ని ఒక నియోజకవర్గంలో అయినా రప్పించగలరా? 
– జగన్‌ గారు చేస్తున్న మేలు కుటుంబాలు అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించాయి. 
– అందుకే వారంతా నేడు మేం నియోజకవర్గాలకు వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 
– ఈ యాత్రలు సక్సెస్‌ అవున్నాయి కాబట్టే ఆ పత్రికలు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫోటోలు తీసి పబ్లిష్‌ చేస్తున్నారు. 
– ఆ పత్రికలు చదువుతున్న పాఠకులు ఈ వాస్తవాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. 

విషాన్ని మరింత ఎక్కించేందుకు ఉచితంగా ఈనాడు పంపిణీ:
– ఈ విషాన్ని ప్రజల్లోకి పంపాలని ఈ మధ్య ఉచితంగా కూడా పేపర్‌ వేస్తున్నారట. 
– బలవంతంగానైనా ఆ విషాన్ని ప్రజలపై రుద్దాలనుకుంటున్నారు. 
– ఆ రెండు పత్రికలు చదివితే..బయట కూర్చున్న వారికి, విదేశాల్లో, వేరే రాష్ట్రాల్లో ఉన్న వారికి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అనిపిస్తుంది. 
– కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలకు మాత్రం అలా అనిపించదు. 80 శాతానికి పైగా ప్రజలు బెనిఫిట్‌ పొందుతున్నారు కాబట్టి స్థానికులకు అలా అనిపించదు. 
– నిరుద్యోగులకు ఏదో ఒక రకమైన ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగాలు లక్షల్లో ఇచ్చాం. 
– పింఛన్‌ ఠంచన్‌గా మొదటి తేదీన అందుతుంది కాబట్టి ప్రజలు వారు రాసే రాతలు నమ్మరు. 
– ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది..అందుకే ఎకానమీలోనూ గ్రోత్‌ కనిపిస్తోంది. 
– భారీ ఇళ్ల నిర్మాణం సాగుతోంది..ప్రజలకు పని క్రియేట్‌ అవుతోంది. 
– దీన్ని దాచిపెట్టి..ఎవరికీ తెలియదని భావించి వీళ్లంతా రాతలు రాస్తుంటారు. 
– వీరు ఈ రాతలు కర్నాటక, తెలంగాణల్లో ఉన్న వారికి నిజమే అనిపిస్తుంటుంది. వాస్తవాలు ఏంటో అందరూ గమనించాలి. 

భయాన్ని పరిచయం చేసే వాడివి ఢిల్లీలో ఎందుకు దాక్కున్నావ్‌ లోకేశ్‌..?:
– లోకేశ్‌ ఈ రోజు మళ్లీ మొదలుపెట్టాడు..భయాన్ని పరిచయం చేస్తాడట. 
– వాళ్ల నాన్న తప్పుడు పనిచేసి అరెస్ట్‌ అయిన రోజు కళ్లనీళ్లు పెట్టుకుని ఏడ్చుకుంటూ ఢిల్లీ వెళ్లి ఇన్నాళ్లు ఎందుకు కూర్చున్నాడు..? 
– అసలు భయం, భయపడటం అనే ప్రశ్న రాజకీయాల్లో ఎందుకొస్తుంది..? 
– నువ్వు ప్రజల్లో ఉండే మనిషివి అయితే..ప్రజల సేవకే నీ పార్టీ ఉంటే...ఈ భయాలు..పీకడాలు ఎందుకొస్తాయి..? 
– నువ్వేం చేశావో చెప్పు...జగన్‌ గారు చేసిన దాంట్లో లోపమేమన్నా ఉంటే చూపించు. 
– కానీ వాళ్లేం చేశారో చెప్పడానికి లేదు..జగన్‌గారి పరిపాలనలో ఎత్తి చూపడానికి ఏమీ లేదు. 
– ఇక బూతులు తప్ప ఏమొస్తాయి..? లేదా పూనకం వచ్చినట్లు ఊగిపోవడం వస్తుంది. 
– ఈ రోజు టేప్‌రికార్డర్‌ ఆఫ్‌ చేసి మళ్లీ ఆన్‌ చేసినట్లు సేమ్‌ రికార్డు మొదలైంది. 
– జనం నవ్వుకోడానికి ఒక జోకర్‌ దూరం అయ్యాడనుకున్నారు..మళ్లీ వచ్చాడు. 
– ఇలాంటి వాళ్లను తీసుకుని, కేవలం ఆ రెండు మీడియా సంస్థలను నమ్ముకుని ప్రజలను కన్ఫ్యూజ్‌ చేస్తున్నారు. 
– మళ్లీ అధికారంలోకి రావాలనే ఆలోచనతో చంద్రబాబు రోజూ విషం కక్కిస్తున్నారు. ప్రజల మొదడులలో ఎక్కించాలని చూస్తున్నారు. 

అసలు మీకు 175 స్థానాలలో అభ్యర్థులున్నారా బాబూ..?:
– పవన్‌కల్యాణ్‌ అనే వ్యక్తికి ఏం ప్రలోభ పెట్టారో తెలియదు కానీ...అతని వెంట దేబరించి పాకులాడుతున్నాడు. 
– అసలు టీడీపీ తరఫున పోటీ చేయడానికి చంద్రబాబుకు 175 నియోజకవర్గాలకు అభ్యర్థులున్నారా? 
– ఏ టూ జడ్‌ అర్కెస్ట్రా పక్కన పెట్టుకుని తానేదో బలవంతుడిని అనుకుంటున్నాడు. 
– ఈ రోజుకైనా టీడీపీ విధానం ఇది..మా పార్టీ అభ్యర్థులు వీళ్లు అని చెప్పగలిగే స్థాయిలో చంద్రబాబు లేడు. 
– ప్రజల బాగోగులు చూస్తూ వారికి సంక్షేమం అందిచాం కాబట్టే జగన్మోహన్‌రెడ్డి గారికి అలాంటి ధీమా స్పష్టంగా ఉంది. 
– పార్టీ కార్యకర్తలు నుంచి ప్రజల వరకూ విశ్వనీయత అనేది చేరింది కాబట్టి ముందుకు వెళ్తున్నాం. 

నియోజకవర్గం యూనిట్‌గా సాధికార యాత్ర..సచివాలయాల్లో వై ఏపీ నీడ్స్‌ జగన్‌:
– మేం సచివాలయం యూనిట్‌గా ప్రతి ఇంటి తలుపు తట్టి మా గృహసార«థులు వాస్తవాలు వివరిస్తున్నారు. 
– 2014–19లో చంద్రబాబు చేస్తానని చెప్పి ఎగ్గొట్టినివి..జగన్‌ గారు చెప్పినవి చేశారా లేదా అనేది వివరిస్తున్నారు. 
– ఇప్పటికి 30 లక్షల ఇళ్లు టచ్‌ చేశారు. 6,800 సచివాలయాలు పూర్తి చేశారు. 
– అందుకే వీళ్లు దిక్కతెలియక..పూనకం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. 
– ఒక పక్క నియోజకవర్గం యూనిట్‌గా సాధికార యాత్ర దిగ్విజంగా నడుస్తోంది. 
– మరో పక్క గడప గడపకు క్యాడర్‌ వెళ్లి చంద్రబాబు గుట్టు చెప్తుంటే ఆయనకు గుండు సున్నా వస్తోంది. 
– ఆనాడు చెప్పినట్లే ఈ రోజు కూడా నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తానని లోకేశ్‌ చెప్తున్నాడు. 
– మేం ఏది చెప్తే అది జనం నమ్ముతారు అనే బరితెగింపుతో వెళ్తున్నారు. 
– ఆనాడు సబ్సిడీతో 12 సిలిండర్లు ఇస్తానన్నాడు..ఇచ్చాడా..? మళ్లీ ఇప్పుడు మూడు సిలిండర్లు అంటున్నాడు. 
– రుణమాఫీ అన్నాడు..ఎంతమందికి ఇచ్చాడు..ఎంతమందికి ఇవ్వలేదు అనేది తేలిపోతోంది. 
– ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ అనే కార్యక్రమంతో కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లడానికి ఉన్న ధీమా జగన్మోహన్‌రెడ్డి గారు చేసిన పనులే. 
– మీకు మంచి చేస్తేనే నన్ను ఆశీర్వదించండి అని జగన్‌ గారు స్పష్టంగా చెప్తున్నారు కాబట్టే ప్రజల నుంచి స్పందన లభిస్తోంది. 
– మీ గ్రామానికి ఇంత చేశామని చెప్పగలిగిన ధీమా, ధైర్యం గతంలో ఎవరికైనా ఉందా?
– వై ఏపీ నీడ్స్‌ జగన్‌ అనేది మేం చెప్పగలిగిన దాంట్లో ఒక్కటంటే ఒక్కటి చంద్రబాబు చెప్పగలడా? 
– అభూత కల్పనలను తన విషపత్రికల్లో రాయించుకుని ఆనందపడిపోతే ఆయన ఖర్మ. 
– రామోజీ, రాధాకృష్ణలు ఎక్కించిన కైపు వల్ల చంద్రబాబు తాను గొప్పవాడిని అనుకుంటే అంతకంటే పొరపాటు లేదు. 
– రాష్ట్రంలోని మిగిలిన గృహాలన్నిటికీ వెళ్లిన తర్వాత ప్రజలు జగన్‌ గారికి బ్లెస్సింగ్స్‌ ఇవ్వబోతున్నారు.
– అభూతకల్పనలు, తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. 
– నిన్న కూడా అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నారంటూ పచ్చి అబద్దాలు వండి వారుస్తున్నారు. 
– వీళ్లకు వీళ్లు ఇక ప్రభుత్వం మారిపోయింది..చంద్రబాబు కుర్చీలో కూర్చున్నాడు అని పగటి కలలు కంటున్నారు. 

అధికారులు డిప్యుటేషన్‌ అడిగిందీ లేదు..మేం ఇచ్చిందీ లేదు:
– అధికారులు డిప్యుటేషన్‌ అడిగింది లేదు..ఈ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందీ లేదు. 
– మాకంటే ఆ అధికారులకే ప్రజల మనోభావాలేంటో స్పష్టంగా తెలుసు..ఎందుకంటే ఈ పథకాలన్నీ చేస్తున్నది వాళ్లు. 
– ఏదో జరగబోతోందని ప్రజలను భయబ్రాంతులను చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. 
– చంద్రబాబు ఏదైతే నమ్ముకోకూడదో దాన్నే నమ్ముకుని దెబ్బతింటూనే ఉన్నాడు. 
– ఈ రోజు కూడా ఆ పత్రికలను నమ్ముకుని ఊహల్లో విహరిస్తున్నాడు. 

అందరూ పక్క రాష్ట్రంలోనే..కానీ ఈ రాష్ట్రంలో పెత్తనం కావాలట:
– చంద్రబాబు ఈ రాష్ట్రంలోనే కాపురం ఉండని వ్యక్తి. ఆయన దత్తపుత్రుడు, ఉత్త పుత్రుడు కూడా ఇక్కడ ఉండరు. 
– రామోజీ, రాధాకృష్ణలు కూడా పక్క రాష్ట్రంలోనే ఉంటారు..కానీ పెత్తనం చేయాలనుకునేది మాత్రం ఇక్కడ. 
– వీళ్ల వ్యాపారం బాగుండాలి..రాజకీయం బాగుండాలి..రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకోవాలనేదే వీరి కోరిక. 
– అది అసలు రాజకీయ పార్టీనే కాదు..రాజకీయ పార్టీగా కనిపించాలని ప్రయత్నిస్తున్నారు. 
– టీడీపీ ఒక రాజకీయ పార్టీ అనేది ఎన్టీఆర్‌తోనే పోయింది. 
– అధికారంలో ఉన్నా లేక పోయినా తప్పుడు కేసులు పెట్టడం ఎలా..వారిపై కేసులొస్తే తప్పించుకోవడం ఎలా అనేది వారికి వెన్నతో పెట్టిన విద్య.  
– వీళ్లు ఎన్ని చేసినా అల్టిమేట్‌గా ప్రజలకు నువ్వేం చేశావనేదే శాశ్వితం. 
– రాష్ట్రంలో కోటి 40 కుటుంబాలకు జగన్‌గారు అండగా నిలిచారు కాబట్టే మేం ఇంత ధీమాగా ఉన్నాం. 

 టీడీపీ పత్రికలని అచ్చు వేసుకోగలరా?:

– వీళ్లు కక్కుతున్న విషాన్ని అందరి మెదళ్లలోకి ఎక్కించాలనే వారి ప్రయత్నం. మా సాక్షిలో వైఎస్సార్‌ గారి బొమ్మ పెట్టుకున్నా వార్తను వార్తగానే రాస్తాం. దానిపై కామెంట్‌ ఏదన్నా ఉంటే అది రాస్తాం.
– చంద్రబాబు తిట్టినా ఆ తిట్టు మేం ప్రచురిస్తాం. అలాంటిది ఆ రెండు పత్రికల్లో చూపించమనండి. 
– వాళ్లను ఇవి తెలుగుదేశం అధికారిక పత్రిక అని వేసుకోమనండి. జగన్‌గారి పత్రిక అని అందరికీ తెలిసినా నిజమైనా పత్రిక లానే వ్యవహరిస్తుంది. న్యూస్‌ న్యూస్‌లానే వస్తాయి. 
– వారి పత్రికల్లో విషం తప్ప ఏమీ ఉండటం లేదు. ఈ నాలుగు నెలలు ఉచితంగా వేసి ప్రజల మెదళ్లలోకి జొప్పించాలని చూస్తున్నారు. 
– ఇప్పుడు డబ్బులు కడుతున్న చందాదారులు కూడా ఉచితంగా వేయమని రామోజీని అడగాలి. 
– కరపత్రాలైనప్పుడు ఆ పత్రికలకు ఇక విలువేముంటుంది..? 
– స్కూల్‌ డ్రస్‌ వేసుకుని పిల్లలు కళ్ల ముందు కనిపిస్తుంటే డ్రస్సే లేదని రాతలు రాస్తే ప్రజలు ఎందుకు నమ్ముతారు..? 
– వాళ్ల ప్రపంచంలో వాళ్లు కొట్టుకుపోతున్నారు. 
– ఉచితంగా కాదు..ఎదురు వెయ్యి రూపాయలు ఇస్తామన్నా వాటికి క్రెడిబిలిటీ మాత్రం రాదు. 

జగన్‌ గారి సంక్షేమంతో ప్రజల జీవితాల్లో మార్పులు:
– జగన్మోహన్‌రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమం ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చాయి..అది చంద్రబాబు ఏనాడూ చేయలేదు. 
– మరో పక్క జాతీయంగా పెరిగిన ధరలు ఇక్కడొక్కచోటే పెరిగాయంటూ చూపిస్తున్నారు. వాటిని తట్టుకుని నిలబడే అండను జగన్మోహన్‌రెడ్డి గారు ఇస్తున్నారు. 
– తాను చేసింది ఇది అని చెప్పుకోలేని వాడు వేరేది ఏదో చూపించి లబ్ధిపొందాలని చూస్తాడు. 
– పావళా ఇచ్చి రూపాయి ఎక్కడ లాగుతున్నారు..? ధరలు పెరగడం రాష్ట్ర పరిధిలోనిదా? 
– కోవిడ్‌ సమయంలోనూ మన ఇండికేటర్స్‌ పాజిటివ్‌గా ఎందుకు మారాయి..? 
– ఎంఎస్‌ఎంఈల లెక్కలు చూస్తే చంద్రబాబు హయాంలో 1.80 లక్షల యూనిట్లు ఉంటే...ఇప్పుడు దాదాపు ఐదు లక్షలకు చేరాయి. 
– దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో గమనించాలి. ఇది ఎలా సాధ్యం అయ్యిందో గుర్తించాలి. 
– ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఎందుకు టాప్‌ వస్తున్నాం..? 

సామాజిక సాధికార యాత్ర సూపర్‌ సక్సెస్‌:
– లోకేశ్‌ తన యాత్ర ప్రారంభంలో నియోజకవర్గ స్థాయి మీటింగులు పెట్టి స్పందన లేకపోవడంతో నాలుగైదు కలిపి మీటింగులు పెట్టాడు. అదీ దడి కట్టుకుని మీటింగులు పెట్టారు. 
– మేం చేస్తున్న సాధికార యాత్ర సాహసంతో కూడుకున్నది. అగ్రనాయకుడు లేకుండానే ఆయా వర్గాలు నియోజకవర్గ స్థాయిలో చేస్తున్న యాత్ర సూపర్‌ సక్సెస్‌ అవుతోంది. 
– వీళ్లకు వీళ్లు నాలుగు పేర్లు పెట్టుకుని యాత్రలు చేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటే ఎలా? 
– అసలు మీ మేనిఫెస్టో ఏమైంది..? దాన్ని వెబ్‌సైట్లో ఉంచే ధైర్యం, ప్రజలకు చూపించే ధైర్యమే లేదు. 
– నేను ఇది చేశాను అని చెప్పే ధైర్యమూ లేదు. అలవాటు లేని లక్షణంతో, లేని మేనిఫెస్టోతో జనంలోకి వెళితే..వారికి మేం భయపడేదేంటి..? 

కన్నబాబు తమ్ముడి జీవితాన్ని నాశనం చేయాలనేదే వారి తాపత్రయం:
– ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఒక ట్వీట్‌ వస్తుంది...దాన్ని పట్టుకుని ఒక స్టోరీ వస్తుంది..దాన్ని పట్టుకుని మళ్లీ ట్వీట్‌..ఇదే వారి లక్షణం. 
– మా పార్టీ నాయకుడు కన్నబాబు గారి తమ్ముడు 60 లక్షల చెక్‌లు ఇచ్చారట..అదీ చాలా కాలం అయింది.
– అటు నుంచి ఇటు రిజిస్ట్రేషన్లు ఏమీ లేవు..ఎవరు ఎవరికి బాకీ ఉన్నట్లు..? 
– నష్టపోయింది ఇటువైపు అయితే...అటువైపు వారిని బెదిరించడానికి అవకాశం ఎక్కడుంది? 
– దాన్ని తీసుకొచ్చి మాపై రుద్దడం, దానిపై బ్యానర్‌ స్టోరీలు రాయడం వారికి తెలిసిన విద్యలో భాగమే. 
– ఆమెను వైఎస్సార్సీపీ నాయకులు బెదిరించారు అని రాసుకొస్తారు..మీరెళ్లి ప్రొటెక్షన్‌ ఇవ్వాల్సింది..? 
– వీరంతా సెప్టిక్‌ ట్యాంకులో చేపల కోసం వెతికే బ్యాచ్‌. 
– ఎక్కడో ఏదో జరిగితే...అందులో వాస్తవం లేకపోయినా 
– ఇతని డబ్బులే అతని వద్ద ఉన్నాయి...ఇక అక్కడ సమస్య ఎవరికి..? 
– కన్నబాబు తమ్ముడు జీవితాన్ని నాశనం చేయాలనేదే వారి తాపత్రయం. 
– రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి నిందలు వేయడం తప్ప ఏమీ లేదు. 
– కరపత్ల్రాలో వచ్చే అభూత కల్పనలతో రాజకీయం చేసి ఒక్కసారి అధికారంలోకి జంప్‌ చేయాలని అత్యాçసపడుతున్నారు. 
– వారు బోర్లా పడక తప్పదు...శాశ్వితంగా 2024లో భూస్థాపితం అవుతారు. 

Back to Top