ఆకాశంలో అలా వెళ్తున్న అన్న ఎన్టీఆర్ గారికి తెలుగు ప్రజలు గుర్తొచ్చారు. ఓసారి నా ఆంధ్రదేశం ఎలా ఉందో చూడాలి అనుకున్నారు. ఆంధ్రులు ఉన్న రాష్ట్రం, తాను నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ రెండు పేర్లనూ కలుపుకుని ఆంధ్రదేశం అంటూ మురిసిపోవడం ఆయన అలవాటు. అలా అనుకుంటూ కిందకు చూసిన ఎన్టీఆర్ కు కిందంతా రాళ్లు రప్పలూ కనిపించాయి. ఎటు చూడబోతే అటూ కుప్పలు తెప్పలుగా శిలలు. ఇదేమిటి నా రాష్ట్రం ఇలాగయ్యింది? సమాధుల్లా కనిపించే ఆ రాళ్లేమిటి? అంటూ ఉద్రేకపడుతుండగా ఆ వైపుగా వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పలకరించారు. చక్కటి చిరునవ్వుతో ఏమయ్యా ఎన్టీఆర్ ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా మాట్లాడారు. నా సంగతికేమిలే గానీ అలా చూడు ఆంధ్రరాష్ట్రం అలా అఘోరించిందేమిటి? మొక్కలు చెట్ల బదులు రాళ్లు మొలుస్తున్నాయా ఏమిటి? విడిపడిపోయాక రాష్ట్రం ఏదో ఉద్ధరించబడుతుందనుకుంటే ఇలాగైందేంటి? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. వైఎస్సార్ ఆ వైపు చూసి *ఇదంతా నీ అల్లుడి నిర్వాకమే గదా! కిలోమీటరుకో పునాదిరాయి వేస్తూ వస్తున్నాడు. అడుగుకో శంకుస్థాపన చేస్తున్నాడు. అప్పుడెప్పుడో ఐదేళ్ల క్రితం అమరావతికి వేసిన శిలాఫలకం అలాగే పడుంది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఊరూరా పునాదిరాళ్లు మొలుస్తున్నాయి. రాష్ట్రంలో మనుషులకంటే అవే ఎక్కువైపోయేలా ఉన్నాయని అనుకుంటున్నారు* అని క్లారిటీ ఇచ్చారు. ఈ దశమగ్రహం రాష్ట్రాన్ని వీడలేదు ఇంకా. ఇలాంటి కుక్కమూతి పిందెలకు ప్రజలు బుద్ధి చెప్పాలి. నయవంచకుడు, పచ్చి అవకాశవాది అయిన బాబును నమ్మడం ఎప్పుడు మారతారో అప్పుడే రాష్ట్రానికి అసలైన శుభం కలుగుతుంది, ఆవేశంగా అని వెళ్లిపోయారు ఎన్టీఆర్. అవును అదే నిజం అంటూ నిష్క్రమించారు వైఎస్సార్.