జల యజ్ఞం

వ్యవసాయానికి అత్యవసరమైన సాగునీటి కొరత లేకుండా చేయాలన్న బృహత్తర సంకల్పంతో, ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలోని చిన్న, మధ్య, భారీ నీటి పారుదల ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేయాలన్న లక్షంతో చేపట్టిన కార్యక్రమమే జలయజ్ఞం. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం పెంపొంది,  ఆ రంగంలో నిలకడైన పురోగతి సాధ్యమైంది.

రాష్ట్రంలో కరువు రక్కసిని తరిమికొట్టి, ప్రతి ఎకరానికీ నీళ్లిచ్చి, రైతు కళ్లలో ఆనందం నింపాలన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్పాలనికి మహత్వపూర్ణ రూపమే జలయజ్ఞం. ఆయన చేపట్టిన ప్రాజెక్టులతో జలకళ కళకళలాడి లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. కరువు, వలసలతో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు అధికారంలోకి వచ్చిన సంవత్సరమే జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసి, అనుమతులు తెచ్చి, నిధులు అందించి, నిర్మించి అందించడం వరకూ అన్నీ శరవేగంగా సాగాయి. ఫలితం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అన్నపేరును సార్థకం చేసుకుంది.

86 ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించగా అందులో 33 ప్రాజెక్టులు తెలంగాణా ప్రాంతానివే. గత పాలకులు పదేళ్ల కాలంలో 10,000 కోట్లు మాత్రమే సాగునీటి రంగానికి కేటాయిస్తే రాజశేఖర్ రెడ్డి 95,539 లక్షల కోట్ల నిధులు కేటాయించి కొత్తగా 24 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తెచ్చారు. ఏళ్లుగా బీళ్లుగా పడి ఉన్న నేలలకు నీరందించి అన్నదాత భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన రైతుబాంధవుడు వైఎస్సార్. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరాన్ని ఆరంభించి, అనుమతులు తెచ్చి 80శాతం పనులు పూర్తి చేసిన ఘనతకూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే. గుండ్లకమ్మ, వెలిగొండ, అలీసాగర్, సుద్దవాగు, దేవాదుల, సురంపాలెం, మద్దువలస, పెద్దేరు ఇలా పదుల సంఖ్యలో ప్రాజెక్టులను పూర్తి చేసి అపర భగీరథుడిగా అన్నదాతల మెప్పు పొందారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వ్యవసాయానికి స్వర్ణయుగాన్ని అందించిన జలయజ్ఞం వైఎస్సార్ కీర్తిని వెయ్యింతలు చేసింది.

 

Back to Top