బార్ల పాలసీపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

అమరావతి: బార్ల పాలసీపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎక్సైజ్‌ శాఖ అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. మద్యపాన నిషేధంపై సీఎం వైయస్‌ జగన్‌ అడుగులు వేస్తున్న విషయం విధితమే. ఇప్పటికే బెల్టుషాపులను రద్దు చేయించారు. నూతన మద్యం పాలసీని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో బార్ల పాలసీపై నూతన విధానాలు రూపొందిస్తున్నారు. ఈ విషయాలపై సీఎం వైయస్‌ జగన్‌ అధికారులతో చర్చిస్తున్నారు.
 

Read Also: బాబు మాటలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం

Back to Top