తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటిడిపి కార్యకర్త కిరణ్ చేబ్రోలుపై వైయస్ఆర్‌సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు కేసు పెట్టారు. వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకారావు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు దొడ్డ అంజిరెడ్డి, బూత్ కమిటీ స్టేట్ కో-ఆర్డినేటర్ కొండమడుగు సుధాకర్‌రెడ్డి, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, నవరత్నాల కమిటీ మాజీ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.