వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్య‌మిద్దాం

మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్. బి.అంజాద్ బాష పిలుపు

వైయ‌స్ఆర్ జిల్లా: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్య‌మిద్దామ‌ని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్. బి.అంజాద్ బాష పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం కడప నగరంలోని అంజాద్‌బాషా నివాస కార్యాలయంలో వక్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం త‌ల‌పెట్టిన లాంగ్ మార్చ్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం చేయాలని స‌న్నాహాక స‌మావేశం నిర్వ‌హించారు. సమావేశానికి ముందు కాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గాం లో జరిగిన ఉగ్రదాడి లో మరణించిన వారికి స్మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు జమాల్ వలి, నిత్యానంద రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top