చంద్రబాబు  వికృత క్రీడను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపు

మీడియా చెప్పిందే జనం నమ్ముతార‌న్న‌ది చంద్ర‌బాబు సిద్ధాంతం 

సోషల్ మీడియా వేదిక‌గా టీడీపీ ఫేక్ న్యూస్ ప్ర‌చారానికి తెర‌

వైయ‌స్ జ‌గ‌న్ గ‌త ఐదేళ్ల పాల‌న‌తో ఇవాళ  ఏమాత్రం తడబాటు లేకుండా జనంలోకి వెళ్తున్నాం

వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్ షాప్

తాడేప‌ల్లి: రాజకీయం పేరుతో చంద్రబాబు ఆడుతున్న వికృత క్రీడను ప్రజల్లోకి తీసుకెళ్లాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పార్టీ అధికార ప్ర‌తినిధుల‌కు పిలుపునిచ్చారు. సోమ‌వారం వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వ‌హించారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ఏర‌కంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌నే అంశంపై అధికార ప్ర‌తినిధుల‌కు పార్టీ స్టేట్ కో -ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి,  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి అవ‌గాహ‌న క‌ల్పించారు.

పార్టీ మ‌రింత బలోపేతం కావాలి: సజ్జల రామకృష్ణారెడ్డి 
`పార్టీ ఆలోచనలను, విధానాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రత్యర్థులకు ధీటుగా వాళ్ళలోకి ఎలా తీసుకెళ్లాలి అన్న అంశాలపై అవగాహన కలిగించడమే ఈ వర్క్ షాప్ ఉద్దేశం. రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మీరు ఈ మెళకువలు వాడుకుని జనంలోకి తీసుకునిపోవాలి. మీ ద్వారా పార్టీని మరింత బలోపేతం కావాలి.  
మీడియానే నమ్ముకుని దాని ద్వారానే ప్రజలను భ్రమలో పెట్టే బలమైన, అత్యంత శక్తివంతమైన దురాలోచనలు చేయగలిగే ప్రత్యర్థిని మనం ఎదుర్కుంటున్నాం. కాబట్టి మనం చాలా వేగంగా అన్ని అంశాలపై విస్తృతంగా అవగాహన చేసుకోవాలి. ఇది చాలా ప్రాధాన్యమైన అంశం. ఇప్పటికే పార్టీ కార్యకర్తలుగా మీరు పార్టీ ఐడియాలజీ ప్రకారం పనిచేస్తున్నారు. దానిని మరింత మెరుగుపర్చుకోవడానికి ఈ వర్క్ షాప్ మీకు ఉపయోగపడుతుంది. ప్రొఫెషనల్ గా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళడానికి, మీరు ఎదగడానికి కూడా సహకరిస్తుంది. సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే మీకు మీరుగా కూడా స్మార్ట్ ఫోన్ సహకారంతోనే  విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకుపోవచ్చు. మీ అభిప్రాయాన్ని వేలు, లక్షల మందికి కూడా రీచ్ అయ్యేలా చేసే అవకాశం ఉంటుంది. పార్టీ అధికార ప్రతినిధులుగా మీకు ఈ అవగాహన అనేది చాలా అవసరం` అని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సూచించారు.

ప్ర‌జ‌ల‌కు ఏం చేశామ‌న్న‌దే ముఖ్యం
`చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ... మీడియా ఏం చూపుతుందో అదే జనం నమ్ముతుందన్న సిద్ధాంతాన్ని ఒంటబట్టించుకున్నారు.  వైయ‌స్ రాజశేఖర రెడ్డి, వైయ‌స్ జ‌గ‌న్‌ అయితే ప్రజలకేం చేశామన్నది మాత్రమే రాజకీయ పార్టీ పనితీరుకు ప్రాతిపదిక అవుతుందని బలంగా నమ్మారు. చంద్రబాబు ఏం చేసినా దాన్ని చారిత్రక ఆవశ్యకత అనేలా మీడియా ద్వారా నమ్మించగలగడమో... అలా భ్రమలు కల్పించడమే చేస్తాడు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టుకుని ఫేక్ ప్రచారానికి పాల్పడుతున్నాడు. దీన్ని మరలా మెయిన్ మీడియాలో వచ్చేట్టు చేయడంతో పాటు.. దానిపై పార్టీ నాయకులతో మాట్లాడిస్తారు. వాస్తవానికి సంబంధం లేని ఫేక్ ప్రచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల వక్ఫ్ బిల్లుపై మనం వ్యతిరేకిస్తే... దానికి మద్ధతు ఇచ్చి.. సమాధానం చెప్పవలసిన టీడీపీ తిరిగి  వారి ఫేక్ ఫ్యాక్టరీకి ద్వారా తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారు. వాళ్లు చేసిన స్కాంలు ఆధారాలున్నవాటిని కూడా ఫేక్ ప్రచారాలు చేసి..జనాలు ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకుండా చేస్తున్నారు. ఇంకోవైపు పై నుంచి కింద వరకు బందిపోట్ల తరహాలో ఇసుక, కాంట్రాక్టర్లు, నామినేటెడ్ పనుల్లో దోపిడీ చేస్తున్నారు. పై స్దాయిలో అమరావతి పేరుతో అంచనాలు పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇవి ప్రజల దృష్టిలో పడకుండా...డైవర్షన్ కోసం అక్రమ అరెస్టులు చేస్తూ.. భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రకటిస్తూ.. మొబలైజేషన్ అడ్వాన్సులు ప్రవేశపెట్టి దాని ద్వారా మొదట్లోనే కమిషన్లు దండుకుంటున్నారు. ప్రాజెక్టులు వచ్చినా రాకపోయినా అడ్వాన్వులు పేరిట దోచుకుంటున్నారు` అని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విమ‌ర్శించారు. 

హామీల ఊసే లేదు
`ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ కూట‌మి నేత‌లు అమ‌లుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ సాధ్యం అని తిరిగి ప్రజలను ప్రశ్నిస్తున్నాడు. సంపద సృష్టికి 2047 వరకు టైం అడుగుతున్నాడు. దీంతో ప్రజలు చంద్రబాబుకి ఓటు వేసినందుకు తమను తాము నిందించుకుంటున్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌ నిబద్ధతతో కూడిన రాజకీయం చేశారు.  ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే రాజకీయాలు చేయడం, పేదలకు, సంపన్నులకు మధ్య అంతరాలు తగ్గించడం, నిజమైన ప్రజాస్వామ్యంలో మహాత్మా గాంధీ కోరుకున్న గ్రామస్వరాజ్యాన్ని సాధించడం కోసం ఏం చేయాలో అది చేసి చూపించిన నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్‌. ఎన్నికల్లో మనం ఓడిపోయిన తర్వాత కూడా ఏమాత్రం తడబాటు లేకుండా జనంలోకి వెళ్లడానికి అవకాశం ఇచ్చింది కేవలం వైయ‌స్ జ‌గ‌న్ పాలన మాత్రమే.
ఐదేళ్లు వైయ‌స్ జ‌గ‌న్‌ పాలనలో దుబారా లేకుండా... ప్రజా సంక్షేమం కోసమే పనిచేశారు. అప్పులు చేసినా వాటిని దుర్వినియోగం చేయలేదు. బాధ్యతాయుతమైన ఇంటి యజమానిలా పనిచేశారు. 2019లో ఓడిపోయిన తర్వాత మూడేళ్ల పాటు చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఎవ్వరూ కనిపించలేదు. కోవిడ్ లో కూడా కనిపించలేదు. మనం కులం, మతం, ప్రాంతం రాజకీయ పార్టీలు కూడా చూడకుండా ప్రజాసంక్షేమాన్ని చూస్తే... టీటీపీ వాళ్లు వాళ్ల పార్టీ మాత్రమే చూసుకుంటున్నారు. వాళ్ల కార్యకర్తలు, నేతల ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారు.  
అపోహలు, అనుమానాలతో మనకు దూరమైన వర్గాలను  మీరు దగ్గరకు తీసుకోవాలి. ఆ దిశగా మీరందరూ ప్రజల్లోకి తీసుకుని పోయేందుకు జిల్లా స్ధాయిలో  కీలక పాత్ర పోషించాలి.  రాజకీయం పేరుతో చంద్రబాబు ఆడుతున్న వికృత క్రీడను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వ్యవస్ధలో ఆయన చేస్తున్న ఘోరాలును తీసుకెళ్లాలి. జిల్లా స్ధాయిలో జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టాలి. జిల్లా స్ధాయిలో జరుగుతున్న అక్రమాలపై.... నిరంతరం రోజువారీ మీ వైపు నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జిల్లా ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. అవసరం అయిన పక్షంలో వెంటనే రెస్పాండ్ కావాలి` అని సజ్జల రామకృష్ణా రెడ్డి అధికార ప్ర‌తినిధుల‌కు దిశానిర్దేశం చేశారు. 

Back to Top