తాడేపల్లి: విశాఖపట్నం, గుంటూరు నగర మేయర్ పదవులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు మున్సిపాలిటీలలో మొత్తం తొమ్మిది పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. కుప్పం, తుని, పాలకొండలో మున్సిపల్ చైర్‌పర్సన్ పదవులకు.. మాచర్ల, తాడిపత్రి (2), తునిలో వైస్ చైర్‌పర్సన్ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఆ మున్సిపాలిటీల్లో ఎన్నికల కోసం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఈనెల 22న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. పోలీసుల కనుసన్నల్లో కుప్పం వైయస్ఆర్‌సీపీ కి చెందిన డా. సుధీర్ కొద్ది నెలల క్రితం కుప్పం చైర్‌పర్సన్ పదవితో పాటు కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నూతన చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేందుకు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం 25 వార్డులకు గాను వైయస్ఆర్‌సీపీ 19, టీడీపీ కేవలం 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సుధీర్ రాజీనామా చేసినప్పటికీ 18 మందితో వైయస్ఆర్‌సీపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అయినప్పటికీ టీడీపీ ‘ముఖ్య’ నేత సూచన మేరకు ఆ పార్టీ నేతలు కొందరు బరితెగిస్తూ నేరుగా రంగంలోకి దిగారు. బెదిరింపులు, తాయిలాలతో కౌన్సిలర్లను దారిలోకి తెచ్చుకుని చైర్మన్ గిరీ కొట్టేయాలని కుట్రకు తెరతీశారు. వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్ల రాక కుప్పం మున్సిపల్ చైర్సన్ ఎన్నికల కోసం వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు బెంగళూరు క్యాంపు నుంచి ఎమ్మెల్సీ భరత్ నేతృత్వంలో కుప్పంకు ట్రైన్‌లో బయలుదేరి వచ్చారు. కుప్పం రైల్వేస్టేషన్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు పోలీస్ భద్రతతో కౌన్సిలర్లు రానున్నారు. ఎమ్మెల్సీ భరత్ ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. కాగా, బెంగళూరు క్యాంపు నుంచి వస్తున్న వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లకు బందోబస్తు కల్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కుప్పంలో 144 సెక్షన్ విధించారు. గుంటూరులో బలం లేకున్నా కూటమి బరితెగింపు నేడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నారు. బలం లేకపోయినా మేయర్ అభ్యర్థి నిలబెట్టిన కూటమి ప్రభుత్వం. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 57 డివిజన్లు వైయస్ఆర్‌సీపీ-46, టీడీపీ-9, జనసేన-2 స్థానాల్లో గత ఎన్నికల్లో విజయం సాధించారు. వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన నాయకులు ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లను బెదిరించి భయపెట్టి తమ వైపుకు తిప్పుకున్న కూటమి నేతలు వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లకు కూటమి నేతలు ప్రలోభాలు, బెదిరింపులు కార్పొరేటర్లను కొనుగోలు చేస్తున్న కూటమి నేతలు మేయర్ ఎన్నికల్లో విప్ జారీచేసిన వైయస్ఆర్‌సీపీ.. అచ్చాల వెంకటరెడ్డిని మేయర్ అభ్యర్థిగా ఎన్నుకున్న వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లు