జత్వానీ కౌంటర్ కేసు ఒక దుష్ట సంప్రదాయానికి రోల్‌మోడల్

అధికార దుర్వినియోగానికి ఈ కేసు పరాకాష్ట

దేశంలోనే ఇటువంటి ఒక తప్పుడు కేసు ఇదే మొదటిసారి

వైయస్‌ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మహనోహర్‌రెడ్డి

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి

ఏడు నెలల తరువాత జత్వానీతో ఫిర్యాదు చేయించారు

ఏనాడు ఆమె మేజిస్ట్రేట్‌ ముందు పోలీస్ అధికారులపై ఫిర్యాదు చేయలేదు

న్యాయస్థానాలకే కౌంటర్‌ కేసుకు ఆదేశాలిచ్చే అధికారం

పోలీస్ వ్యవస్థ, న్యాయ ప్రక్రియనూ భ్రష్టు పట్టిస్తున్న కూటమి సర్కార్

మండిపడ్డ వైయస్‌ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మహనోహర్‌రెడ్డి

తాడేపల్లి: కాదంబరీ జత్వానీతో కూటమి ప్రభుత్వం పెట్టించిన తప్పుడు కౌంటర్‌ కేసు దేశంలో ఒక దుష్ట సంప్రదాయానికే రోల్‌మోడల్‌గా మిగిలిపోతుందని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికార దుర్వినియోగంకు ఈ కేసు పరాకాష్టగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో మేజిస్ట్రేట్ ముందు ఏనాడు పోలీసులపై ఫిర్యాదు చేయని జత్వానీతో ఏడు నెలల తరువాత కూటమి ప్రభుత్వం కావాలనే పిలిపించి తప్పుడు ఫిర్యాదు చేయించిందని, దేశంలోనే ఇటువంటి కౌంటర్‌ కేసు ఇదే మొదటిదని అన్నారు.

ఇంకా ఆయనేమన్నారంటే...

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రమే ఇటు పోలీస్ వ్యవస్థలో, అటు న్యాయ ప్రక్రియ విషయంలో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముంబైకి చెందిన కాదంబరీ జత్వానీ సినీనటి. దేశ వ్యాప్తంగా ఆమెపై కేసులు ఉన్నాయి. ఏపీలో కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పాటు చేసుకుని, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్, హనీ ట్రాప్‌తో రూ.కోటికి పైగా బ్యాంక్‌ల ద్వారా తన ఖాతాలకు జమ చేయించుకున్నారని పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్లాక్ మెయిలింగ్‌కు లొంగకపోవడంతో కుక్కల విద్యాసాగర్ ఆస్థిని కాజేసేందుకు దొంగ సంతకాలతో డాక్యుమెంట్లను సృష్టించి ఇతరులకు అమ్మేందుకు రూ.5 లక్షలు అడ్వాన్స్‌ కూడా తీసుకున్నట్లు తేలింది. కొనుగోలు చేసిన వ్యక్తులు దీనిపై కుక్కల విద్యాసాగర్‌తో క్రాస్‌ చెక్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

చట్టప్రకారమే జత్వానీ అరెస్ట్

కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుపై పోలీసులు చట్టప్రకారం దర్యాప్తు జరిపి, ఇందులో ముద్దాయి కాదంబరీని అరెస్ట్ చేసేందుకు విజయవాడ న్యాయస్థానంలో పిటీషన్ వేసి, సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. అనంతరం ముంబై జూహూ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి, స్థానిక పోలీసుల సహకారంతో ముద్దాయిని, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి, అంథేరీ కోర్ట్‌లో హాజరుపరిచారు. అక్కడి న్యాయస్థానం సంతృప్తి చెందిన తరువాత విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. తరువాత ఈ కేసుకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు, సిమ్ కార్డ్, సెల్‌ఫోన్‌లను మద్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మొత్తం ఆధారాలతో ముద్దాయిలను కోర్ట్‌లో హాజరుపరిచారు. దీనిపై కోర్ట్ వారిని రిమాండ్‌కు పంపారు. అనంతరం పోలీసులు తదుపరి విచారణ కోసం పోలీస్ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై అయిదు రోజుల పోలీస్ కస్టడీకి జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను అప్పగించారు. కస్టడీలో కూడా వారు అనేక విషయాలను వెల్లడించారు. తరువాత ముద్దాయిలు వేసుకున్న రెండు బెయిల్ పిటీషన్లు కూడా డిస్మిస్ అయ్యాయి. 2024 ఏప్రిల్ 24న ముద్దాయిలు వేసుకున్న కండీషన్ బెయిల్‌ మంజూరయ్యింది. 23 రోజుల తరువాత మోడిఫికేషన్ జరిగి బెయిల్ కండీషన్లను రిలాక్స్ చేశారు. ముంబైలో అరెస్ట్ చేసిన నాటి నుంచి విజయవాడ కోర్ట్‌కు తీసుకువచ్చిప్పడు, పోలీస్ కస్టడీలో విచారణ విషయలో ఎక్కడా పోలీస్ అధికారులపై ఆమె ఫిర్యాదు చేయలేదు. నాతో పోలీస్ అధికారులు చట్టప్రకారమే వ్యవహరించారని, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదని  మేజిస్ట్రేట్ ముందు చెప్పారు. అలాగే ఎలాంటి ఫిర్యాదు కూడా చేయలేదు. పోలీస్ కస్టడీలో అడ్వకేట్ సమక్షంలోనే పోలీసులు విచారణ జరిపారు. మద్యవర్తులు, అడ్వకేట్ సమక్షంలో పోలీస్ కస్టడీలో జరిగిన విచారణలో జత్వానీ అంగీకరించిన అన్ని విషయాలను మధ్యవర్తులు రాసిన తరువాత దానిపై సంతకం చేసేందుకు ఆమె నిరాకరించారు. మద్యవర్తులు మాత్రం సంతకాలు చేశారు. దీనిని బట్టి ఆమెను ఎక్కడా పోలీసులు నిర్భందం, వత్తిడి చేయలేదు. పోలీసులు సమర్పించిన నివేదికలోనూ ఆమె సంతకం చేసేందుకు నిరాకరించారనే రాసి, కోర్ట్‌లో సమర్పించారు. 

కుట్రపూరితంగా జత్వానీతో తప్పుడు ఫిర్యాదు చేయించారు 

విజయవాడ, ముంబై కోర్ట్‌ల్లో తనపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని, తప్పుడు కేసు పెట్టారని జత్వాని ఎటువంటి ఆరోపణలు చేయలేదు. దర్యాప్తు ప్రక్రియ ముందుకు సాగుతున్న తరుణంలో ఆగస్టు 2024 అంటే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత టీవీ5 కి జత్వానీ ఇచ్చిన ఇంటర్వూలో నాపైన తప్పుడు కేసులు పెట్టాయంటూ ఆరోపణలు చేశారు. ఈ ఇంటర్వూ తరువాత ఆన్‌లైన్ ద్వారా పోలీస్ అధికారులు ఒక ఫిర్యాదు తెప్పించుకున్నారు. దానిని ఎల్లో మీడియాలో ప్రముఖంగా ప్రచురించారు. జత్వానీపై అప్పటి పోలీస్ అధికారులు దురుసుగా ప్రవర్తించి, తప్పుడు కేసులు పెట్టారంటూ కథనాలు రాశారు. ఎల్లో మీడియా వార్తల ఆధారంగా సిటీ పోలీస్ కమిషనర్ ఒక విచారణాధికారిని నియమించారు. తరువాత 2024 సెప్టెంబర్ 5న జత్వానీ విజయవాడకు వచ్చి నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తరువాత కొందరి స్టేట్‌మెంట్‌లను కూడా పోలీసులు తీసుకున్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందే జత్వానీ కేసులో కొందరు పోలీస్ అధికారులు సీఐ నుంచి సూపర్ వైజర్ స్థాయిలో ఉన్న డీజీపీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు వరకు కేసులు పెట్టారు. కుక్కల విద్యాసాగర్‌ను అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 13న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అంతకు ముందే విచారణాధికారి ఇచ్చిన నివేదక ఆధారంగా ఈ పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఒక కేసులో నేరం చేశారన్న అభియోగాల నేపథ్యంలో చట్టప్రకారం అరెస్ట్ అయి ప్రధాన నిందితురాలుగా ఉన్న కాందబరీ జత్వానీ తనపై ఉన్న కేసుల దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే, ఇంకా చార్జ్‌షీట్ కూడా దాఖలు కాని సందర్భంలో, కోర్ట్‌లో ఉన్న కేసులో ఆ ప్రక్రియను నీరుగార్చేలా కేసును డైవర్ట్ చేసి, ఆ కేసులో ఫిర్యాదు ఇచ్చిన కుక్కల విద్యాసాగర్, ఆ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులపైన కౌంటర్ కేసులు పెట్టారు. ఇది దేశ చరిత్రలో ఎక్కడా ఇలా జరగలేదు. కేసు అండ్ కౌంటర్ కేసులంటే ఇరు వర్గాల మధ్య ఘర్షన జరిగిన్పపుడు ఇరు పక్షాలు కేసులు పెట్టుకుంటాయి.

 జత్వానీకి కూటమి సర్కార్ రాచమర్యాదలు

జత్వానీ కేసులో ఏడు నెలల తరువాత ప్రభుత్వం మారగానే కూటమి ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు జత్వానీని విలాసవంతమైన హోటల్‌లో పెట్టి, ఆమెకు రాచమర్యాదలు చేసి, ప్రోటోకాల్ దర్శనాలు చేయిం, ఆమెతో తప్పుడు ఫిర్యాదులు తీసుకుని కేసు పెట్టారు. ఇది చట్ట ప్రకారం తప్పు. ఇది సెక్షన్ 195 సీఆర్పీసీ ప్రకారం ఆ న్యాయస్థానంలో ఏదైనా తప్పుడు కేసు పెట్టారని, తప్పుడ డాక్యుమెంట్లు చూపించారని, దర్యాప్తులో ఒక వర్గంకు అనుకూలంగా చేశారనే విషయాలు ఉంటే ఏ కోర్ట్లో ఆ వ్యవహారంలో జరుగుతుందో ఆ కోర్ట్ కొన్ని ఆదేశాలు ఇవ్వవచ్చు. దానిపై దర్యాప్తు చేయమని, బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని, డిపార్ట్‌మెంట్ పరంగా చర్యలు తీసుకోవాలని కోర్ట్ మాత్రమే ఆదేశాలు ఇచ్చే అధికారం ఉంది. కానీ ఈ కౌంటర్ కేసు ఏడు నెలల తరువాత పోలీస్ అధికారులపై కక్ష తీర్చుకోవడానికి ఇలా తప్పుడు కేసు పెట్టారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని, పెద్ద ఎత్తున అల్లర్లు జరగాలని చంద్రబాబు సంకల్పించిన సమయంలో అప్పటి అధికారులు రాజమండ్రి జైలు వరకు ఎటువంటి అల్లర్లు జరగకుండా పకడ్భందీగా బందోబస్త్ నిర్వహించారనే కక్షతోనే వారిపై ఇలా తప్పుడు కేసులు పెట్టించారు. అలాగే సిట్ దర్యాప్తులో స్కిల్ డెవలప్‌మెంట్ ఇతర స్కాంలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. సిట్ లోని అధికారులపై కక్ష తీర్చుకునేందుకు ఇలాంటి తప్పుడు కేసులు బనాయించారు. అలాగే సిట్‌కు సలహాదారుగా ఉన్న అడ్వోకేట్ ఐ.వెంకటేశ్వర్లుపై కూడా కేసు పెట్టడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సందర్భంలో ఈ కేసు చట్టం ముందు నిలబడదని తెలిసి, తాత్కాలికంగా అధికారులను వేధించేందుకు జత్వానీ వ్యవహారాన్ని ప్రభుత్వం వాడుకుంటోంది. 

 పోలీస్ అధికారుల మనోస్థైర్యంను దెబ్బతీశారు

కూటమి సర్కార్ వల్ల కక్షసాధింపులు ఎదుర్కొంటున్న అధికారులు తమ సుదీర్ఘ కెరీర్‌లో ఒక్క చిన్న మచ్చ కూడా లేదు. వారికి అనేక అవార్డులు, మెడల్స్, ప్రభుత్వాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థలను పతనం చేసేందుకు ఎంతకైనా దిగజారుతోంది. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇదే పద్దతి వచ్చే ప్రభుత్వం కూడా అమలు చేస్తే ఏమవుతుంది? సోషల్ మీడియా, పలు తప్పుడు కేసుల్లో పోలీసులు తమపైన బలవంతంగా స్టేట్‌మెంట్లు తీసుకున్నారని ముద్దాయిలు ఎదురు కేసులు పెట్టే అవకాశం ఉంది. బలవంతంగా మాతో సాక్షాలు చెప్పించారంటూ పోలీసులపై సాక్షులు కేసులు పెట్టే అవకాశం ఉంది. ఒక దుష్ట సంప్రదాయంకు ఆజ్యం పోస్తున్నారు. పోలీసులు కూడా ఆలోచించాలి. పై అధికారుల ఒత్తిడితో ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారు. వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తే, దాని పరిణామాలు ఎలా ఉంటాయి? గూగూల్ టేక్ అవుట్స్, ఫోన్ రోమింగ్ సమాచారం, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు ఇలా ప్రతి అంశాన్నీ పరిగణలోకి తీసుకుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లుగానే వచ్చే ప్రభుత్వం చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికే అనేక మంది పోలీస్ అధికారులకు జీతాలు చెల్లించకుండా, రీజనల్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలంటూ వేధింపులకు గురి చేస్తోంది. పోలీస్ అధికారుల సంఘాలు కూడా దీనిపై స్పందించాలి. రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు పెట్టి, అధికారులను సంతృప్తి పరిచామంటూ చేతులు దులుపుకుంటే, భవిష్యత్తులో న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా కేసుల్లో పోలీస్ అధికారులు గతంలో అరెస్ట్ చేసిన ముద్దాయిలతో ఎదురు కేసులు పెట్టిస్తున్నారు. 

 మద్యంపైనా ఇదే తరహా కౌంటర్ కేసులు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మద్యంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. చంద్రబాబు దీనిలో ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారనే కక్షతోనే బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు పలువురు అధికారులపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాం అంటూ కౌంటర్ కేసులు పెట్టింది. ప్రభుత్వమే మద్యంను విక్రయించిన నేపథ్యంలో స్కాం అనే దానికే అర్థం లేదు. అలాంటిది రాజకీయంగా వైయస్ఆర్‌సీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని లిక్కర్ స్కాం అంటూ కేసులు పెట్టారు. అధికారులను దీనిలో భాగస్వాములు చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల్లో మద్యం కేసుల్లో ఏ అధికారి ఎవరి ఇంటికి వెడుతున్నారు, ఏ డిస్టిలరీ యజమానితో మాట్లాడారు, ఎవరితో ఏ రకంగా ఫిర్యాదులు చేయిస్తున్నారో అందరికీ తెలుసు. భవిష్యత్తులో వీటిపై పోలీసులు న్యాయస్థానాల ముందు ఇబ్బందులను ఎదుర్కొంటారు. పోలీసులు చట్ట ప్రకారం, న్యాయ ప్రక్రియ ప్రకారం పనిచేయాలి. రాజకీయ విశ్వాసం కోసం కాకుండ ప్రజల విశ్వాసం కోసం పనిచేయాలి.

Back to Top