ఐదేళ్ల క్రితం జరిగిన సంఘటనపై ఇప్పుడు కేసా? 

గత సీఎం వైయస్ జగన్‌ను అసభ్యకరంగా తిట్టిన వారిని మీరు సపోర్ట్ చేస్తారా?

అదే మిమ్మల్ని తిడితే మీరు ఉరుకుంటారా?

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, న‌ర్సీప‌ట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్

అన‌కాప‌ల్లి:  ఎప్పుడో ఐదేళ్ల క్రితం జ‌రిగిన సంఘ‌ట‌న‌ను ఆధారం చేసుకొని తాజాగా పోలీసులు కేసు పెట్ట‌డం దారుణ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, న‌ర్సీప‌ట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ మండిప‌డ్డారు. కూటమి పాలనలో పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. `వైయస్ జగన్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అప్పటి మంత్రులను టిడిపి కార్యకర్త లక్ష్మణ్ దారుణంగా తిట్టారు. తిట్టిన వీడియోను సోషల్ మీడియాలో టిడిపి కార్యకర్త పెట్టాడు. అప్ప‌ట్లో టిడిపి కార్యకర్తను వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మందలించారు. ఐదేళ్ల తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. 2019 లో జరిగిన సంఘటనపై నిన్న మాకవరపాలెంలో 8 మందిపై కేసు పెట్టారు. ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. మరో నలుగురిని అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. టిడిపి కార్యకర్త వైయ‌స్ జగన్ ను తిట్టిన వీడియోను మీడియా సమావేశంలో ప్రదర్శించిన ఉమా శంకర్ గణేష్. గత సీఎం వైయస్ జగన్ ను అసభ్యకరంగా తిట్టిన వారిని మీరు సపోర్ట్ చేస్తారా? . అదే మిమ్మల్ని తిడితే మీరు ఉరుకుంటారా?. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది` అంటూ ఉమా శంకర్ గణేష్ భ‌రోసా ఇచ్చారు.

Back to Top