శ్రీహరి రావు హత్య కేసులో ఏ విచార‌ణ‌కైనా సిద్ధం 

మాజీ ఎమ్మెల్యే సింహాద్రి ర‌మేష్‌బాబు స‌వాల్‌

కృష్ణా జిల్లా: డాక్ట‌ర్ శ్రీహరి రావు హత్య కేసులో ఏ విచార‌ణ‌కైనా తాను సిద్ధ‌మ‌ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స‌వాల్ విసిరారు. డాక్ట‌ర్ శ్రీహరిరావు హత్యకేసులో నన్ను ఇరికించేందుకు ఎంపీ బాలశౌరి , ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ కక్షపూరితంగా కుట్ర‌ప‌న్నార‌ని మండిప‌డ్డారు. త‌న‌పై నింద వేసి తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఎన్నికలకు ముందు నాలుగేళ్లు ఏనాడూ శ్రీహరి రావు హత్య గురించి బుద్ధప్రసాద్ మాట్లాడలేద‌ని, హ‌త్య‌ కేసులో దోషులను శిక్షించమని నేను అనేక సార్లు కోరిన‌ట్లు చెప్పారు. త‌న‌ను అరెస్ట్ చేసి అల్లరి చేయడం కోసమే బుద్ధ ప్రసాద్ హడావిడి చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. పైకి సౌమ్యుడిలా కనిపించే బుద్ధప్రసాద్ చేసేవన్నీ దుర్మార్గపు పనులే అన్నారు.
 
 

Back to Top