తాడేపల్లి: పులివెందులలో ‘‘ఎల్‌వీపీఈఐ’’ సహకారంతో అత్యాధునిక సౌకర్యాలతో రాజారెడ్డి కంటి ఆస్పత్రిని ప్రారంభించడం గర్వంగా ఉందని మాజీ సీఎం, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఈ క్షణం.. అదే ఆస్పత్రికి చెందిన ప్రఖ్యాత వైద్యుడు, మా నాన్న జ్ఞాపకాలను తిరిగి తెస్తోంది. పులివెందులలో కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆస్పత్రి సేవలు అందిస్తోంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఈ ఆస్పత్రిలోనే పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఆస్పత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి రాజారెడ్డి ఆస్పత్రి కంటి వైద్య సేవలు అందించనుంది’’ అని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.