పొగాకు రైతుల‌కు అండగా ఉంటాం

ఐటీసీ పొగాకు కంపెనీ గోడౌన్‌ సందర్శించిన కాటసాని  

నంద్యాల జిల్లా:  పొగాకు రైతుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా ఉంటుంద‌ని నంద్యాల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భ‌రోసా క‌ల్పించారు. ఓర్వకల్ లోని ఐటీసీ పొగాకు కంపెనీ గోడౌన్‌ను ఆయ‌న శుక్ర‌వారం సంద‌ర్శించారు. పోగాకు రైతులు పడుతున్న క‌ష్టాలు, న‌ష్టాలు తెలుసుకున్నారు. పొగాకుకు మ‌ద్ద‌తు ధ‌ర లేక తీవ్రంగా న‌ష్ట‌పోతున్న‌ట్లు రైతులు కాట‌సాని దృష్టికి తీసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పొగాకు కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశ‌రు. రైతులకు కనీస వసతులు కల్పించాలని అధికారులను కోరారు. ఆయ‌న వెంట  మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మీదివేముల ప్రభాకర్ రెడ్డి, జడ్పిటిసి రంగనాథ్ గౌడ్, వైయ‌స్ఆర్‌సీపీ వెంగన్న, మహేశ్వర్ రెడ్డి , శంకర్ రెడ్డి,  చంద్రశేఖర్ రెడ్డి  ఉన్నారు.
 

Back to Top