రేపు వైయ‌స్ఆర్ జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు(శుక్ర‌వారం) వైయ‌స్ఆర్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. శుక్ర‌వారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. అక్కడ 11 గంటలకు మేడా రఘునాధ్‌ రెడ్డి కన్వెన్షన్‌లో ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్న వైయస్‌ జగన్‌, అనంతరం అక్కడి నుంచి బెంగళూరు బయలుదేరి వెళతారు.

Back to Top